Published On: Wed, Jan 11th, 2017

అమ‌రావ‌తికి మౌలిక స‌దుపాయాల బృహ‌త్త‌ర ప్ర‌ణాళిక

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: రాజ‌ధాని అమ‌రావ‌తిలో నివ‌శించే జ‌నాభాకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అమ‌రావ‌తి అభివృద్ధి సంస్థ (ఏపీ ఏడీసీ) ఆక‌ర్ష‌ణీయ‌మైన మౌలిక స‌దుపాయాల బృహ‌త్త‌ర ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేస్తోంది. రాజ‌ధాని నిర్మాణానికి ముందు, త‌రువాత తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, భ‌విష్య‌త్తులో రాజ‌ధాని జ‌నాభాకు ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త క‌ల్పించే విష‌య‌మై ఏపీ ఏడీసీ అధికారులు ఆక‌ర్ష‌ణీయ‌మైన మౌలిక స‌దుపాయాల బృహ‌త్త‌ర ప్ర‌ణాళిక‌పై సంస్థ‌ క‌న్స‌క‌ల్టెంట్‌లు అయిన ఆర్వీ, జీఐఐసీ (చైనా) ప్ర‌తినిధుల‌తో మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ కేదారేశ్వ‌ర‌పేట‌లోని ఏడీసీ కార్యాల‌యంలో స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు.  ప్రపంచ ప్ర‌ఖ్యాత రాజ‌ధాని న‌గ‌రాల్లో అమ‌రావ‌తిని ఒక‌టిగా నిర్మించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తున్న నేప‌థ్యంలో అమ‌రావ‌తి న‌గ‌ర నిర్మాణాన్ని ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్దే విష‌య‌మై ఏపీ ఏడీసీ అధికారులు ప్ర‌తినిధుల‌తో ప్ర‌ధానంగా చ‌ర్చించారు. రాజ‌ధాని జ‌నాభాకు ర‌క్ష‌ణ‌క‌ల్పించే శాంతి భ‌ద్ర‌త‌లు (పోలీసింగ్‌), అగ్నిమాప‌క వ్య‌వ‌స్థ‌లను స‌మ‌కూర్చ‌డానికి పొరుగు దేశాలు అవ‌లంభిస్తున్న విధి విధానాల‌ను అడిగి తెలుసుకున్నారు.  దీనితో పాటుగా అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఎప్ప‌టిక‌ప్ప‌డు అందిపుచ్చ‌కుంటూ జ‌నాభాకు అవ‌స‌ర‌మైన ప‌రిర‌క్ష‌ణ‌తో కూడిన మౌలిక సాంకేతిక‌త‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చే అంశాల‌ను స్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ మాస్ట‌ర్ ప్లాన్‌కు జోడించాల‌ని ఏపీ ఏడీసీ అధికారులు నిర్ణ‌యించారు.  

img_20170110_112122

అమ‌రావ‌తి ఆక‌ర్ష‌ణీయంగా…
దేశ విదేశాల్లోని  ప‌లు అభివృద్ధి సాధిస్తున్న న‌గ‌రాల్లో మ‌హిళ‌లు, చిన్న పిల్ల‌ల భ‌ద్ర‌త‌కు అక్క‌డి ప్ర‌భుత్వాలు  అలార‌మ్, ఫైర్ సెక్యూరిటీ వ్య‌వ‌స్థ‌లను ఏర్పాటు చేయ‌టం ద్వారా వ‌చ్చే  ప్రయోజ‌నాల‌పై చ‌ర్చించారు. ఆయా న‌గ‌రాలు జ‌నావాసాల‌కు  క‌ల్పిస్తున్న‌ ర‌క్ష‌ణాప‌ర‌మైన  చ‌ర్య‌లను  ప‌రిగ‌ణ‌లోనికి తీసుకోవ‌టంతో పాటు నవ రాజ‌ధాని అమ‌రావతి  భ‌విష్య‌త్తు ప్ర‌యోజ‌నాల‌పై క‌న్స‌ల్టెంట్ల అనుభ‌వాల‌ను తీసుకున్నారు. వీట‌న్నింటి కంటే ముఖ్యంగా న‌గ‌ర  అమ‌రావ‌తి ముఖ‌ద్వారాల‌ను మేలి మ‌లుపులుగా నిర్మించేందుకు ఆర్వీ అసోసియేట్స్ ప్ర‌తినిధులు  బాగా ప్ర‌సిద్ధి చెందిన న‌గ‌ర ముఖ చిత్రాల‌ను దృశ్య శ్ర‌వ‌ణం ద్వారా వివ‌రించారు.

ప‌టిష్టంగా ట్రాఫిక్ వ్య‌వ‌స్థ‌…
అభివృద్ధి చెందుతున్న న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌లో ట్రాఫిక్ స‌మ‌స్య శ‌రాఘాతంగా మారింది. అమ‌రావ‌తికి ఇరు వైపులా ఉన్న విజ‌య‌వాడ‌, గుంటూరు న‌గ‌రాల్లో జ‌నాభా పెరుతున్న కొద్ది  ట్రాఫిక్ స‌మ‌స్య కూడా అదే రీతిలో పెరుగుతూ వ‌స్తోంది.  అమ‌రావ‌తిలో 2050 నాటికి 3.5 మిలియ‌ను జ‌నాభా నివ‌శిస్తుంద‌ని మెకెన్సీ వేసిన అంచ‌నాను ప‌రిగ‌ణ‌లోనికి తీసుకొని ట్రాఫిక్ నియంత్రణ వ్య‌వ‌స్థ, కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు, నిఘా కెమెరాల ద్వారా ట్రాఫిక్ నియంత్ర‌ణ త‌దిత‌ర అంశాల‌పై జీఐఐసీ ప్ర‌తినిధులు చైనాలో అవ‌లంభిస్తున్న ట్రాఫిక్ విధానాల‌ను వివ‌రించారు. ఈ స‌మావేశంలో ఏపీ ఏడీసీ సీటీవో కె.సుద‌ర్శ‌న్‌రెడ్డి అర్బ‌న్ ప్ర‌ణాళికా విభాగాధిప‌తి డాక్ట‌ర్ కె.వి.గ‌ణేష్‌బాబు, అర్బ‌న్ ఇన్‌ఫ్రా ప్లానర్లు వై.వి.కృష్ణ‌, కె.ల‌వ‌ణ్‌కుమార్‌, ఉమేష్ చంద్ర  త‌దిత‌రులు పాల్గొన్నారు.

Just In...