Published On: Sat, Aug 26th, 2017

ఆర్టీసీ బస్సులో రూ.40 లక్షల బంగారు ఆభరణాల చోరీ

సెల్ఐటి న్యూస్‌, ఏలూరు డెస్క్‌: ఆర్టీసీ గరుడ బస్సులో ప్రయాణిస్తున్న రాజస్థాన్‌కు చెందిన ఓ బంగారు దుకాణం వ్యాపారి వద్ద ఉన్న రూ. 40 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్‌ చోరీకి గురైయ్యాయి. ఏలూరు గ్రామీణ పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన సంజయ్‌ జాదవ్‌జీ బంగారం వ్యాపారం చేస్తుంటారు. ఇతను తన తండ్రితో కలిసి గురువారం విశాఖప‌ట్నం నుంచి విజయవాడకు ఆర్టీసీ గరుడ ప్లస్‌ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ఈ బస్సు రాజమహేంద్రవరం, ఏలూరు దాటిన అనంతరం కృష్ణాజిల్లా పొట్టిపాడు టోలుగేటు వద్దకు వచ్చేసరికి ఈ వ్యాపారి వద్ద సంచిలో ఉన్న రూ. 40 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఒక ల్యాప్‌టాప్‌ కనిపించలేదు. దీంతో గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించి వుంటారని భావించారు. అదేబస్సులో విజయవాడ పోలీసుస్టేషన్‌కు వెళ్లి విషయం చెప్పారు. బస్సు డ్రైవర్‌ను పోలీసులు వివరాలు అడగగా అన్నవరంలో ఓ వ్యక్తి, రాజమండ్రిలో నలుగురు, ఏలూరు ఆశ్రం ఆసుపత్రి వద్ద ముగ్గురు బస్సు నుంచి దిగినట్లు చెప్పాడు. దీంతో చివరి స్టేజిలో ప్రయాణికులు ఆశ్రం వద్ద దిగారు కాబట్టి కేసు ఏలూరు పోలీసుస్టేషన్‌లో నమోదు చేస్తారని అక్కడిపోలీసులు చెప్పారు. దీంతో బాధితుడు ఏలూరు రూరల్‌ పోలీసుస్టేషన్‌కు వచ్చి పిర్యాదు చేయగా ఆ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

crime_news-2

Just In...