Published On: Tue, Aug 29th, 2017

గ్యాస్ లీకై సిటీ బస్సు దగ్ధం

* విజ‌య‌వాడ‌లో ప్ర‌యాణికుల‌కు తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: గ్యాస్‌ లీకై ఆర్టీసీ సిటీ బస్సు (ఎపి11జెడ్‌6409) దగ్ధమైన ఘటన విజయవాడలోని సిద్దార్థ వైద్య కళాశాల సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జ‌రిగింది. ప్ర‌మాదానికి సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. సర్వీస్‌ నంబర్‌ 54 సీఎన్జీ బస్సు ఆటోనగర్‌ నుంచి రైల్వేస్టేషన్‌కు ప్రయాణికులతో వెళుతోంది. ఈ క్రమంలో వైద్య కళాశాల దగ్గరకు రాగానే గ్యాస్‌ లీకవుతున్నట్లు గుర్తించిన డ్రైవర్ వెంట‌నే బస్సును నిలిపివేసి, ప్రయాణికులందరినీ కింద‌కు దించేశాడు. అనంతరం బస్సును పరిశీలిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు మొత్తం క్ష‌ణాల్లో దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి నష్టం జరగలేద‌ని ఆర్టీసీ ఆర్‌.ఎం.రామారావు తెలిపారు. జాతీయ రహదారిపై ప్రమాదం సంభవించడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది.

vij_citybus_caught_fire_4 vij_citybus_caught_fire_2 vij_citybus_caught_fire_3 vij_citybus_caught_fire_1vij_citybus_caught_fire_5vij_citybus_caught_fire_6

Just In...