Published On: Fri, Sep 8th, 2017

గత ప్రభుత్వాలు ముస్లింలను ఓటు బ్యాంకుగానే గుర్తిచాయి

* ఎమ్మెల్యే బోండా ఉమా

* ఇందాద్ ఘర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉప‌కార‌వేత‌నాలు, పుస్తకాలు పంపిణీ

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: ఇందాద్‌ఘర్ ఆధ్వర్యంలో అరండ‌ల్‌పేట అబ్దుల్ కలాం ఉర్థూ హైస్కూల్ లో గురువారం విద్యార్థిని, విద్యార్థులకు స్కాలర్షిప్ లు, పుస్తకాల పంపిణీ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విచ్చేసారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఉన్నత భావాలు కలిగిన అబ్దుల్ కలాంను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వాలు ముస్లిం మైనారిటీలను ఓటు బ్యాంకు గానే గుర్తించాయని నేడు తమ ప్రభుత్వం మైనారిటీలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అవి అందరికి అందేలా అమలు చేస్తోందని స్పష్టం చేశారు. దుల్హన్ పథకంతో పెళ్లి చేసుకోబోయే ప్రతి మహిళకు 50 వేలు ఇస్తున్నామని ఎన్టీఆర్ విద్యా వికాసం ద్వారా విదేశీ విద్యను అందుబాటులోకి తెచ్చామని కపర్ స్థాన్ల అభివృద్ధికి 1 కోటి 33 లక్షలు ఇచ్చిన ఘనత తమదేనని స్పష్టంచేశారు. మసీదుల్లో పనిచేస్తున్న హిమాములకు మోజుదులకు జీతలుకూడా ప్రభుత్వమే అందిస్తుందన్నారాయన. ఇన్ని సంక్షేమ పథకాలు మైనారిటీలకు ఏ ప్రభుత్వ హయాంలో సవ్యంగా అమలు పరిచిన దాఖలాలు లేవని అది  చంద్రబాబునాయుడివల్లే సాధ్యపడిందని కొనియాడారు. లాంచాలకు తమ ప్రభుత్వంలో చోటు లేదని నీతి, నిజాయితీలకు తెలుగుదేశం పార్టీ పెట్టింది పేరని స్పష్టం చేశారు. విద్యార్థులకు స్కాలర్షిప్ లు పుస్తకాలు పంపిణీ చేస్తున్న  ఇందాద్ ఘర్ కమిటీ సభ్యులను అభినందించారు. అనంతరం ఆయన చేతులమీదుగా విద్యార్థులకు స్కాలర్షిప్ లు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇందాద్ ఘర్ ట్రెజరర్ ఎం.డి షఫీ (అంజాద్), సెక్రటరీ ఎం.డి ఫిరోజ్, డైరెక్టర్ ఎం.డి ఖమర్, డైరెక్టర్ ఎం.డి అన్సారే, విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
muslims_meet_with_bonda_1muslims_meet_with_bonda_2

Just In...