Published On: Fri, Sep 8th, 2017

ప్రకాశం బ్యారేజీ వద్ద పెరిగిన నీటి మట్టం

* 11.5 అడుగులకు చేరిన నీరు

* 14,601 క్యూసెక్కుల అవుట్ ఫ్లో

* 81 శాతం నాట్లు పూర్తి

* కృష్ణా డెల్టాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు 

* మంత్రి దేవినేని

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: కృష్ణా ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరందించేందుకు ప్రారంభించిన పథకాలు ఫలాలను అందిస్తున్నాయి. ప్రస్తుతం కృష్ణా ఆయకట్లులో దాదాపు 81శాతం వరి నాట్లు పూర్తయ్యాయి. జలసరికి హారతి కార్యక్రమం మూడు రోజుల పాటు జరుగుతున్న తరుణంలో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం పెరగటంతో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద 11.5 అడుగుల మేరకు నీరు వచ్చింది. దీంతో అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లు కెనాల్స్ కు విడుదల చేస్తున్నారు. మొత్తం 14,601 క్యూసెక్కుల నీటిని కెనాల్స్ కు వదిల పెడుతున్నారు. కెఇబి కెనాల్ నుంచి 1507 క్యూసెక్కులు, బందరు కెనాల్ నుంచి 1300 క్యూసెక్కులు, ఏలూరు కెనాల్ నుంచి 1021 క్యూసెక్కులు, రైవ‌స్ కెనాల్ నుంచి 4001 క్యూసెక్కులు, కె.ఇ. మెయిన్ కెనాల్ నుంచి 7829 క్యూసెక్కులు, కె.డబ్ల్యూ మెయిన్ కెనాల్ నుంచి 6,500 క్యూసెక్కులు, జి.సిహెచ్ నుంచి 250 క్యూసెక్కుల నీటిని వదిలిపెడుతున్నారు. దీంతో కృష్ణా ఆయకట్టులో వరి నాట్లుకు ఎలాంటి ఇబ్బందిలేకుండా నీటిని అందిస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన పథకాలు ఫలితాలను అందిస్తున్నాయనటానికి కెనాల్స్ లో నీరే ఒక ఉదాహరణ అని అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు అనుకున్న సమయంలో పూర్తి చేయటమే కాదు… వంద టి.ఎం.సి.ల నీటిని ప్రకాశం బ్యారేజీ వద్దకు తీసుకుని వచ్చిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి తెలిపారు. ఇప్పటికే దాదాపు వరినాట్లు పూర్తయ్యాయని పంటకు సరిపడ నీటిని పూర్తి స్థాయిలో అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గోదావరి నీరు రావటంతో కృష్ణా ఆయకట్టులో దిగుబడి పెరిగిందని… ఈ సీజన్ లో కూడా మంచి ఫలితాలను రైతులు సాధిస్తామరని మంత్రి అభిప్రాయపడ్డారు. కృష్ణా ఆయకట్లుతో చివరి ఎకరానికి కూడా నీటిని అందిస్తామని మంత్రి తెలిపారు. దీని కోసం ప్రకృతి కూడా కరుణిస్తుందని అన్నారు. గోదావరి జిలాలతో పాటు కృష్ణా జిల్లాలో కూడా కెనాల్స్ సంవృద్ధిగా నీరు వస్తుందని… దీంతో కృష్ణా ఆయకట్టుకు మంచి రోజులు వచ్చాయని తెలిపారు.
krishna_flood

Just In...