Published On: Sat, Sep 9th, 2017

తెలుగు విద్యార్థుల‌పై క‌న్న‌డిగుల దాడులు అమానుషం

* ఏపీసీసీ ముఖ్య అధికార ప్ర‌తినిధి కొల‌నుకొండ శివాజీ

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: కర్నాటకలో  రైల్వే, బ్యాంకు ఉద్యోగ  పరీక్షలకు  వెళ్లిన తెలుగు విద్యార్థులపై కన్నడిగులు దాడులు చేయడం అమానుష చర్య  అని ఏపీసీసీ ముఖ్య అధికార ప్ర‌తినిధి కొల‌నుకొండ శివాజీ తెలిపారు. శ‌నివారం విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో ఆయ‌న మాట్లాడుతూ  విద్య, ఉద్యోగాల కోసం జా తీయ స్థాయిలో ఎక్కడ పోటీ  పరీక్షలు  నిర్వహించినా హాజరయ్యే హక్కు భారతీయులందరికీ ఉంటుందన్న సత్యాన్ని కన్నడిగులు గ్రహించాల‌ని పేర్కొన్నారు., దేశ సమైక్యతను విచ్ఛిన్నం చేసే ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా కర్నాటక ప్రభుత్వం చర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. దాడి  ఘటనలపై  తెలుగు రాష్ట్రాల  ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు  వెంటనే  స్పందించి కర్నాటక సీఎంతో చ‌ర్చించి  తెలుగు విద్యార్థులకు  హాని కలగకుండా తగిన రక్షణ కల్పించాల‌ని కొల‌నుకొండ శివాజీ కోరారు.
kolanukonda_sivaji_1

Just In...