Published On: Mon, Sep 11th, 2017

పిడుగుపాటుకు ఇద్దరు బాలురు మృతి

సెల్ఐటి న్యూస్‌, వరదయ్యపాళెం (చిత్తూరు): చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం చిన్నఈటిపాతం గ్రామంలో పిడుగుపాటుకు ఇద్దరు బాలురు మృతిచెందారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం అలముకొంది. ఆదివారం గ్రామంలో అకస్మాత్తుగా వర్షంతో పాటు పిడుగులు పడడంతో విమల్‌రాజు(14), మహేశ్‌(14)తో పాటు మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యయి. వీరిని సత్యవేడు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో విమల్‌, మహేశ్‌ చనిపోయారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

thunderastrom_1

Just In...