Published On: Mon, Sep 11th, 2017

ప‌ర్యాట‌క అవార్డులు, రివార్డులు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కే సొంతం

* సాంస్కృతిక‌, ప‌ర్యాట‌క శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి ముఖేష్‌కుమార్ మీనా

* స‌గ‌టున నెల‌కు ఒక‌టి, కొన‌సాగుతున్న ప‌రంప‌ర

* సాహ‌స ప‌ర్యాట‌క ప్రోత్సాహంలోనూ మ‌నకే గుర్తింపు

* ప్ర‌భుత్వ ఈవెంట్ల ప‌రంగా తొలి 2 స్ధానాలూ మ‌న‌వే

సెల్ఐటి న్యూస్‌, స‌చివాల‌యం (అమ‌రావ‌తి): ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క రంగానికి అవార్డుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ప‌ర్యాట‌క అనుకూల విధానాల‌తో నిత్య నూత‌నంగా జాతీయ అంత‌ర్జాతీయ స్ధాయి ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించ‌టంలో ముందున్న రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ‌కు మ‌రో అరుదైన గౌర‌వం ల‌భించింది. ప్ర‌తిష్టాత్మ‌క ఎడ్వంచ‌ర్ టూర్ ఆప‌రేట‌ర్స్ అసోషియేష‌న్ అఫ్ ఇండియా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను ఉత్త‌మ సాహ‌స ప‌ర్యాట‌క‌ mukesh_kumar_meena_ias_3భార‌తీయ రాష్ట్రంగా ప్ర‌క‌టించింది. సాహాస క్రీడ‌లు, సాహ‌సోపేత‌మైన ప్ర‌యాణం వంటి రంగాల‌ను ప్రోత్స‌హిస్తున్నందుకుగాను రాష్ట్రానికి ఈ అవార్ఢు ల‌భించింద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్ కుమార్ మీనా వివ‌రించారు. జాతీయ‌, అంత‌ర్జాతీయ స్ధాయిలో స‌గ‌టున ప్ర‌తినెలా ఒక అవార్డును ప‌ర్యాట‌క శాఖ ద‌క్కించుకుంటోంద‌న్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయిడి నుండి ల‌భిస్తున్న ప్రోత్సాహంతో త‌మ అధికారులు, సిబ్బంది చేస్తున్న నూత‌న అవిష్క‌ర‌ణ‌ల ఫ‌లితంగానే ఇది సాధించ‌గ‌లిగామ‌ని పేర్కొన్నారు. ఈ నెల 19వ తేదీన కేర‌ళ వేదిక‌గా జ‌రిగే అవార్డుల ప్ర‌ధానోత్స‌వంలో ఎపిటిడిసి ఎండి హిమాన్హు శుక్లా ఈ పుర‌స్కారాన్ని అందుకుంటార‌ని ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు.
మ‌రోవైపు ఈవెంట్ అండ్ ఎంట‌ర్‌టైన్ మెంట్ మానేజ్‌మెంట్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా ప్ర‌క‌టించిన అవార్డుల‌లో  రెండింటిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ టూరిజం సొంతం చేసుకుంద‌న్నారు. ప్ర‌భుత్వ‌ప‌ర‌మైన ఈవెంట్ల‌కు సంబంధించిన విభాగంలో  48 ఎంట్రీలు రాగా తొలి 2 స్ధానాల కోసం మ‌న‌కై మ‌న‌మే పోటీ ప‌డిన‌ట్లు అయ్యింద‌న్నారు. గోల్డెన్ ఈవెంట్‌గా  2017 ఫిబ్ర‌వ‌రిలో నిర్వ‌హించిన విశాఖ పెస్టివ‌ల్‌,  సిల్వ‌ర్ ఈవెంట్‌గా అమ‌రావ‌తి మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌ రికార్డుల‌కు ఎక్కాయి. ఇది సాధార‌ణ విష‌యం కాద‌ని ఒడిదుడుకుల‌ను ఎదుర్కుంటున్న ఒక నూత‌న రాష్ట్రం జాతీయ స్ధాయిలో వ‌రుస‌గా తొలి 2 స్ధానాల‌ను ద‌క్కించుకోవ‌టం ప్రభుత్వ స‌త్తాను వెల్ల‌డిస్తుందన్నారు. ఇదిలా ఉండ‌గా ఇండియ‌న్ అసోసియేష‌న్ ఆఫ్ టూర్ ఆప‌రేట‌ర్స్ భువ‌నేశ్వ‌ర్ వేదిక‌గా నిర్వ‌హించిన 33వ వార్షిక స‌ద‌స్సులో ఎపి టూరిజం ఏర్పాటు చేసిన స్టాల్ ఉత్త‌మ‌మైన‌దిగా ఎంపికైంది. ఎపిటిడిసి ఎండి హిమాన్హుశుక్లా స్వయంగా ఆ కార్య‌క్ర‌మంలో పాల్గొని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క శాఖ చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌ను జాతీయ స్ధాయిలో ప్రాచుర్యం, ప్ర‌చారం పొందేందుకు విశేష కృషి చేసార‌ని ఈ నేప‌ధ్యంలో మీనా తెలిపారు. ఈ క్ర‌మంలోనే 2018లో ఈ స‌ద‌స్సును నిర్వ‌హించే అరుదైన అవ‌కాశం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ల‌భించింద‌ని, దీనికి సంబంధించిన అధికార దండంను ఒడిస్సా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ నుండి శుక్లా అందుకున్నార‌ని ముఖేష్ తెలిపారు. ప‌ర్యాట‌కుల రాక ప‌రంగా కూడా గ‌ణ‌నీయమైన పురోగ‌తిని సాధించామ‌ని రానున్న రోజుల్లో మ‌రిన్ని వినూత్న కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్యాట‌కులు చూడ‌బోతున్నార‌న్నారు.

Just In...