Published On: Mon, Sep 11th, 2017

కంచె ఐలయ్యదీ రచన కాదు పైత్యం..!

* విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కోశాధికారి బండారు రమేశ్

* ఐలయ్య అనుచిత వ్యాఖ్య‌ల‌పై షాద్‌నగర్‌లో ఆర్యవైశ్యుల ఆందోళన

* దిష్టిబొమ్మ దగ్దం

సెల్ఐటి న్యూస్‌, షాద్‌న‌గ‌ర్‌: ఆర్యవైశ్యులను కించపరిచే విధంగా పుస్తకం రాసిన కంచె ఐలయ్యది పైత్యం అని అతనిపై వెంట‌నే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఆర్యవైశ్యులు సోమ‌వారం ఉద‌యం ఆందోళన నిర్వహించారు. స్థానిక చౌరస్తాలో ఆర్యవైశ్యులు కంచె ఐలయ్య దిష్టిబొమ్మ దహనం చేశారు. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తూ నినాదాలు kancha_ilaiah_1చేశారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ రాష్ర్ట కోశాధికారి
బండారు రమేశ్,ఆర్యవైశ్య నేత బేజుగం రమేశ్ ఆందోళనను ఉద్దేశించి మాట్లాడుతూ కంచె ఐలయ్య తర్కంలో, రచనల్లో పరిపూర్ణ పైత్యం కనిపిస్తుంద‌న్నారు. వైశ్యుల ఆగ్రహాంలో అర్థమున్నట్టు సమాజానికి స్పష్టంగా అనిపిస్తుంద‌నీ నిజానికి ఈ అజ్ఞానపు రాతల్ని వైశ్యసమాజం తూర్పార బడుతుందన్నారు. ఆయన రాతలు ఒక కులంపై పడి ఏడుస్తున్నట్టుగా ఉన్నాయని ఆ రాతలు తప్పితే, తను రాసే రాతలకు కనీస ఆధారాలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఏ ఆధారంగా తను ఈ అంచనాలకు, విశ్లేషణలకు వచ్చాడో చెప్పాలని డిమాండ్ చేశ‌ళారు. ఒక కులంపై ద్వేషాన్ని విరజిమ్మడమే లక్ష్యంగా కనిపిస్తుంద‌ని విమర్శించారు.
‘‘ప్రతి కులం ఓ రిజిమెంట్ స్థాపించాలా..? వెజిటేరియన్లుగా ఉండటం కూడా నేరమేనా ? … అసలు వెజిటేరియన్లుగా ఉంటే ఆయనకు అభ్యంతరం ఏమిట‌ని వారు ప్రశ్నించారు. ఎంతటి నీచమైన, నేలబారు, దరిద్రమైన ఆరోపణ చేస్తున్న ఐలయ్యపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇదీ పర్‌ఫెక్ట్ పాతాళ స్థాయి రచన అనీ ఒక కులానికీ ఇతర కులాలకూ నడుమ కుంపట్లు రగిల్చే యత్నమనీ  ఒక కులాన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి, విషం కక్కే ప్రయత్నం చేసిన ఐలయ్య బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వ‌స్తోంద‌ని హెచ్చ‌రించారు.

Just In...