Published On: Mon, Sep 11th, 2017

షరీఫ్ మృతిపట్ల ఐజేయూ, ఏపీయూడబ్లూజే నివాళి

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: టిబిఎన్ ఛానల్ రిపోర్టర్ గుల్జారీ షరీఫ్ ఆదివారం హఠాన్మరణం చెందారు. ఆయన  మృతిపట్ల ఐజేయూ, ఏపీయూడబ్లూజే తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఖుద్దూస్‌నగర్లోని ఇంటివద్ద గుండెపోటుతో షరీఫ్ ఆదివారం అర్థ‌రాత్రి మృతి చెందారు. గతంలో ఆర్కే న్యూస్, ఎన్బీఎన్ చానల్స్‌లో ఆయన పనిచేశారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్లూజే నాయకులు షేక్ బాబు, యూనియన్ కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, కొండా రాజేశ్వరరావు, సీహెచ్ రమణారెడ్డి, శ్రీనివాసరావు, మురళీకృష్ణ బాబు తదితర జర్నలిస్టులు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢమైన సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన మృతిపట్ల యూనియన్ అధ్యక్షులు జి.రామారావు, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు జయరాజ్, విలియం పాల్, ఇ.చావా రవి, ఎన్వీఎస్ చలపతిరావు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. షరీఫ్‌కు ఏడాదిన్నర కుమారుడు, భార్య ఉన్నారు. సోమ‌వారం సాయంత్రం ష‌రీఫ్ అంత్యక్రియల‌ను గవర్నరుపేటలోని ఖబర్థ్సాన్‌లో నిర్వ‌హించారు.

guljari_sharif_reporter

Just In...