Published On: Mon, Sep 11th, 2017

కేసీఆర్ పాల‌న‌లో వైద్య సేవ‌లు ప్ర‌శంస‌నీయం..!

* బీహార్ మంత్రి మంగ‌ళ్‌పాండే కితాబు

సెల్ఐటి న్యూస్‌, హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న కేసీఆర్ కిట్ల ప‌థ‌కం, వైద్య సేవ‌లు వినూత్నంగా, ప్ర‌జ‌ల‌కు ఉప‌యుక్తంగా ఉన్నాయ‌ని పేర్కొంటూ బీహార్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంగ‌ళ్‌పాండే ప్ర‌శంసించారు. సెప్టెంబ‌రు 10న (ఆదివారం) సాయంత్రం స‌చివాల‌యంలోని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.ల‌క్ష్మారెడ్డి ఛాంబ‌ర్‌కు వ‌చ్చిన ఆయ‌న‌కు వైద్య‌, ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ‌ల‌కు చెందిన ప‌లువురు ఉన్న‌తాధికారులు ఆయా అంశాల‌కు సంబంధించి వివ‌రించారు. కాళోజీ హెల్త్ యూనివ‌ర్శిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ క‌రుణాక‌ర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ క‌మిష‌న‌ర్ వాకాటి క‌రుణ‌, ఓడీఎంఈ ర‌మేష్‌రెడ్డి, ఆరోగ్య‌శ్రీ సీఈవో, నిమ్స్ డైరెక్ట‌ర్ మ‌నోహ‌ర్‌, కేసీఆర్ కిట్ల ప‌థ‌కం సీఈవో స‌త్య‌నారాయ‌ణ రెడ్డి, ఈజేహెచ్ఎస్‌ సీఈవో ప‌ద్మ పాల్గొని మంత్రి మంగ‌ళ్‌పాండేకు ప‌థ‌కాల తీరుతెన్నులు, ఉప‌యోగాల‌ను వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో భాగంగా కేసీఆర్ కిట్ల ప‌థ‌కం త‌దిత‌ర వైద్య సేవ‌ల‌కు సంబంధించిన వాహ‌నాల‌ను ప్ర‌ద‌ర్శించారు. తొలుత ఆరోగ్య కేంద్రం ఎంపీహెచ్ఎ (ఎఫ్‌) దేవ‌ల‌ప‌ల్లి కిర‌ణ్మ‌యి పాల్గొని టీకా బైక్‌తో ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొన్నారు.

kcr_11-09-17

Just In...