Published On: Tue, Sep 12th, 2017

విదేశాల్లోనూ యంబీఏ విద్య‌కు *క్యాంప‌స్ కాంటినెట్స్‌* స‌హ‌కారం

* 13, 14 తేదీల్లో విజ‌య‌వాడ‌లో యంబీఏ ఫెస్ట్‌-2017

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: దేశ‌, విదేశాల‌లో యంబీఏ విద్య‌ను అభ్య‌సించే విద్యార్థుల‌కు క్యాంప‌స్ కాంటినెట్స్ అన్ని విధాలా స‌హ‌క‌రిస్తుంద‌ని సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ముషాఫ్ షా మ‌హ్మ‌ద్ తెలిపారు. యంబీఏ విద్యార్థుల‌కు క్యాంప‌స్ కాంటినెట్స్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాన్ని ఈ నెల 13, 14 తేదీల్లో విజ‌య‌వాడ‌లో నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. ఈ విష‌య‌మై సోమ‌వారం ఉద‌యం గాంధీన‌గ‌ర్‌లోని ప్రెస్‌క్ల‌బ్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ముషాఫ్ షా మ‌హ్మ‌ద్ మాట్లాడుతూ న‌గ‌రంలోని హోట‌ల్ డీవీ మాన‌ర్‌లో నిర్వ‌హించే ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనే విద్య‌ర్థుల‌కు ప‌లు విశ్వ‌విద్యాల‌యాలకు చెందిన నిపుణులైన విద్యావేత్త‌లు పాల్గొని ప‌లు సూచ‌న‌లు అందిస్తార‌ని తెలిపారు. ఎంబీఏ ఫెస్ట్‌-2017లో పాల్గొనే విద్యార్థులు ఎటువంటి పారితోష‌కాన్ని చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. మార్కెటింగ్ రంగంలో నిపుణులు సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇస్తార‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే కాకుండా నేపాల్‌, భూటాన్‌, సూడాన్ వంటి దేశాల్లోనూ త‌మ సంస్థ త‌ర‌ఫున విద్యార్థుల‌కు యంబీఏ విద్య‌లో మార్గ‌ద‌ర్శ‌కం చేస్తుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం ద్వారా విద్యార్థులు త‌మ భ‌విష్య‌త్తును నిర్ణ‌యించుకోవాల‌ని సూచించారు. తాము అన్ని రంగాల్లోని విద్యార్థుల‌కు ప్ర‌తి ఏటా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. విలేక‌రుల స‌మావేశంలో సంస్థ ప్ర‌తినిధులు కొనాలి సావ‌రీస్‌, ముబార‌క్ అలి, ఫ‌త‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

campus_continets_1

Just In...