Published On: Tue, Sep 12th, 2017

చైన్ స్నాచింగ్‌కు పాల్ప‌డుతున్న ముఠా స‌భ్యులు అరెస్టు

* 11 బైక్‌లు, 504 గ్రాముల బంగారం స్వాధీనం

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క్రైం: విజయవాడ నగరంలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఎనిమిది మంది సభ్యులు ఉన్న రెండు గ్యాంగ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం సాయంత్రం సూర్యారావుపేట పోలీస్‌స్టేష‌న్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో విజ‌య‌వాడ న‌గ‌ర సంయుక్త పోలీస్ క‌మిష‌న‌ర్ ర‌మ‌ణ‌కుమార్ మాట్లాడుతూ నిందితుల వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఇళ్లలో చైన్ స్నాచింగ్స్ పాల్పడే వారి నుండి రూ.18.10 లక్షల విలువైన సుమారు 504 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాదీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. నిందితుల్లో పలువురు పాత నేరస్థులు ఉన్నార‌ని వెల్ల‌డించారు. నిందితులు జల్సాలకు అలవాటుపడి ఆర్ధిక నేరాలకు పూనుకున్నార‌ని పేర్కొన్నారు. నిందితులు రోడ్ల‌పై ఒంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్‌గా చేసుకొని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడతున్నార‌ని తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా స్నాచర్స్‌ను పట్టుకోవడం జరిగింద‌న్నారు. వీరిలో ముగ్గురు హైద‌రాబాద్‌కు చెందినవారు కాగా ముగ్గురు విజయవాడ, ఇద్దరు కృష్ణా జిల్లాకు చెందినవారిగా గుర్తించామ‌న్నారు. చైన్ స్నాచర్స్ నుండి మొత్తం 11 బైక్‌లను స్వాదీనం చేసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. గతంతో పోల్చుకుంటే చైన్ స్నాచింగ్స్ కేసులు తగ్గుముఖం పట్టాయ‌ని తెలిపారు. చైన్ స్నాచింగ్ దొంగల నుండి భారీ మొత్తం బంగారు ఆభరణాలు స్వాదీనం చేసుకున్నాం. భాదితులు కూడా దొంగతనం జరిగినపుడు పోలీసులకు తప్పుడు సమాచారం ఇవ్వకుండా సహకరించాల‌ని కోరారు. ఎంతయితే బంగారం అపహరణకు గురైందో నిజాయితీగా ఫిర్యాదు చేయాల‌ని సూచించారు.

chain_snaching_crime_2 chain_snaching_crime_1

Just In...