Published On: Tue, Jul 21st, 2020

6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ తేదీ పొడిగింపు

విజ‌య‌వాడ, సెల్ఐటి న్యూస్‌‌: సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న 352 కస్తూర్బా గాంధీ విద్యాలయాలు (కేజీబీవీలు)లో 2020-21 విద్యా సంవత్సరానికి గానూ 6వ తరగతి  ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరించుటకు  జూలై 24 నుంచి ఆగష్టు 15 వరకు పొడిగిస్తూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చ‌ని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. పేద, అనాథ, బడి బయటి పిల్లలు, డ్రాపౌట్ (మధ్యలో బడి మానేసినవారు) బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కొరకు పరిగణించబడతాయని తెలిపారు. ఈ దరఖాస్తులు https://apkgbv.apcfss.in/. వెబ్‌సైట్ ద్వారా పొందగలరని తెలిపారు. ఎంపికైన విద్యార్థినులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందించబడుతుందని అన్నారు. సంబంధిత పాఠశాల నోటీసు బోర్డులో, సమగ్ర శిక్షా వెబ్‌సైట్ (https://ssa.ap.gov.in/SSA/)లోనూ  చూడవచ్చని తెలిపారు. ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే 949438 3617, 94412 70099 నంబర్లను సంప్రదించాలని కోరారు.

Just In...