Published On: Wed, Oct 14th, 2020

6, 11 తరగతుల్లో ఎంపికైన విద్యార్థినుల ధృవపత్రాల పరిశీలన

విజ‌య‌వాడ, సెల్ఐటి న్యూస్‌‌: సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న 2020-21 విద్యా సంవత్సరానికి గాను కస్తూర్బా గాంధీ విద్యాలయాలు (కేజీబీవీ)లో 6, 11 తరగతుల్లో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థినుల నాలుగో జాబితా జాబితా బుధవారం విడుదల చేసినట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థినులు 15.10.2020 తేది నుండి 22.10.2020 తేదీ లోపు ఆధార్ కార్డు, బదిలీ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, కులధ్రువీకరణ పత్రం, SSCపాస్ షార్ట్ మెమో వంటి వివరాలతో సంబంధిత కేజీబీవీలలో స్పెషల్ ఆఫీసర్లకు రిపోర్ట్ చేయవలసిందిగా కోరారు. ఇదివరకే కేజీబీవీల్లో పదో తరగతి చదివి, పాసైన విద్యార్థుల ధ్రువపత్రాలు సంబంధిత కేజీబీవీల్లో
తీసుకోవచ్చని తెలిపారు. సందేహాలకు 94412 70099, 94943 83617 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

 

Just In...