Published On: Tue, Mar 27th, 2018

జైన్ స‌మాజ్ ఆధ్వ‌ర్యంలో విజ‌య‌వాడ‌లో అహింసా ర్యాలీ

 బ్రోచ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌ 

 సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: ఈ నెల 29న భ‌గ‌వాన్ మ‌హావీర్ 2617 జ‌యంతి (జ‌న్మ‌క‌ల్యాణ్‌) సంద‌ర్భంగా విజ‌య‌వాడ జైన్ స‌మాజ్ ఆధ్వ‌ర్యంలో న‌గ‌రంలో అహింసా ర్యాలీని నిర్వ‌హిస్తున్న‌ట్లు జైన్ స‌మాజ్ స‌భ్యులు సంజ‌య్ జైన్‌, మ‌నోజ్‌కొఠారి తెలిపారు. పాత‌బ‌స్తీ పూల‌భావి వీధిలోని రాజేంద్ర‌భ‌వ‌న్‌లో మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో సంజ‌య్‌జైన్‌, మ‌నోజ్‌కొఠారీలు మాట్లాడుతూ బ్ర‌తుకు బ్ర‌త‌క‌నివ్వు అనే సిద్ధాంతంతో జైన్ స‌మాజ్ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంద‌న్నారు. భ‌గ‌వాన్ మ‌హావీర్ జ‌యంతి సంద‌ర్భంగా ఈ నెల 29న ఉద‌యం 8 గంట‌ల‌కు పాత‌బ‌స్తీ గాంధీజీ మ‌హిళా క‌ళాశాల నుంచి 7 వేల మంది జైనుల‌తో నిర్వ‌హించే అహింసా ర్యాలీని జిల్లా క‌లెక్ట‌ర్ బి.ల‌క్ష్మీకాంతం ముఖ్య అతిథిగా హాజ‌రై ప్రారంభిస్తార‌ని చెప్పారు. గాంధీజీ మ‌హిళా క‌ళాశాల నుంచి ప్రారంభ‌మ‌య్యే ఈ ర్యాలీ కాన్వెంట్ వీధి, తారాపేట గూడ్స్ షెడ్‌, లోబ్రిడ్జి, కాళేశ్వ‌ర‌రావుమార్కేట్‌, జెండాచెట్టు సెంట‌ర్, హిందూ హైస్కూల్ రోడ్డు, సామారంగం చౌక్ సెంట‌ర్ మీదుగా తిరిగి గాంధీజీ మ‌హిళా క‌ళాశాల వ‌ర‌కు నిర్వ‌హిస్తామ‌న్నారు. ర్యాలీ అనంత‌రం గాంధీజీ మ‌హిళా క‌ళాశాల ప్రాంగ‌ణంలో జ‌రిగే స‌మావేశంలో జైన్ స‌మాజ్ త‌ర‌ఫున ప‌లువురు గురువులు హాజ‌రై భ‌క్తుల‌నుద్దేశించి ప్ర‌వ‌చ‌నాలు చెబుతార‌ని వారికి ఆశీర్వాదాలు ఇస్తార‌ని తెలిపారు. కార్య‌క్ర‌మం అనంత‌రం గాంధీజీ మ‌హిళా క‌ళాశాల‌లో భ‌క్తుల‌కు అన్న‌సంత‌ర్ప‌ణ గావిస్తామ‌న్నారు. న‌గ‌రంలోని జైనులంద‌రూ ఈ ర్యాలీలో పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా అహింసా ర్యాలీ బ్రోచ‌ర్‌ను ఆవిష్క‌రించారు. విలేక‌రుల స‌మావేశంలో జైన్ స‌మాజ్ స‌భ్యులు ప్ర‌వీణ్ జైన్‌, దినేష్ శ్యాంసుఖ‌, పీయూష్ దేశాయ్‌, ప్ర‌వీణ్ రాంకా త‌దిత‌రులు పాల్గొన్నారు.

Just In...