Published On: Tue, Apr 17th, 2018

పోలవరం ప్రాజెక్టు పనులు 52.20శాతం పూర్తి అయ్యాయి

* పాదయాత్ర పేరుతో వైకాపా నేత‌లు రూ.కోట్లు వసూళ్లు 

* మంత్రి దేవినేని ఉమా

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: ప్రత్యేక హోదా ఉద్యమంలో వైకాపా కార్యకర్తలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తోంటే.. ఆ పార్టీ నాయ‌కుడు వైఎస్ జగన్ మాత్రం ఏసీ టెంటులో తన కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేశారని రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంగ‌ళ‌వారం ఉద‌యం విజ‌య‌వాడ‌లోని త‌మ విడిది కార్యాల‌యంలో మంత్రి దేవినేని ఉమా మీడియా స‌మావేశంలో మాట్లాడారు. సీఎం పదవి కోసమే జగన్ కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ పాదయాత్ర పేరు చెప్పి వైకాపా నేతలు వ్యాపారుల నుంచి కోట్లాది రూపాయలను వసూలు చేస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. జగన్‌ కృష్ణా జిల్లాలో అడుగుపెడుతున్న సందర్భంగా కనకదుర్గ వారధి ఊగిందంటూ ప్రచారం చేసుకోవటం విడ్డూరంగా ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. తన నియోజకవర్గమైన మైలవరంలోకి అడుగుపెడుతున్న జగన్ స్థానికంగా ఉన్న చెరువునీటిని నెత్తిన జల్లుకుని పాపాలు కడుక్కోవాలని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రజాసంకల్ప యాత్రలో ఆయన నడిచే రహదారులను తెలుగుదేశం ప్రభుత్వమే పూర్తి చేసిందని అన్నారు. ప్రధాన కుడి కాలువ 89.10శాతం, ఎడమబప్రధాన కాలువ 58.30శాతం, హెడ్ వర్క్స్ 35శాతం పనులు పూర్తి చేశాం, పనులు వేగవంతంగా జరుగుతున్నాయి, మే చివరి నాటికి డయాఫ్రం వాల్ పూర్తవుతుంద‌న్నారు.
                                                      పోలవరం ప్రాజెక్టుకు రూ.13వేల 364 కోట్లు ఖర్చు పెట్టాం . గోదావరి నీరు ద్వారా పంటలు పండుతున్నా ప్రతిపక్ష నేత జగన్ కు కనిపించడం లేదు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ని జగన్ అంగీకరించలేకే అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మీరు మట్టి పనులు పేరు చెప్పి దోచుకుంటే , మేము పోలవరానికి రూ.13వేల కోట్లు ఖర్చు పెట్టాం. రైతాంగానికి ఎంతో మేలు చేసే పోలవరం ప్రాజెక్టుపై కూడా జగన్ కుట్రలు చేస్తూ విషం కక్కుతున్నాడు. ఖర్చు పెట్టిన డబ్బులో ఎపికి ఇంకా 2వేల 229 కోట్లు రావాల్సి ఉంది. జల సంరక్షణలో భాగంగా మేము చేసిన పనుల వల్ల నేడు చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. ఇంత అభివృద్ధి  జరిగితే  నాలుగేళ్లు ఏం చేశారంటూ బురద జల్లుతున్నారు. పోలవరం, పట్టిసీమలపై రాజకీయం చేస్తున్న జగన్‌కు రైతులే తగిన బుద్ది చెప్పాలి. నేను అడిగిన ఏడు ప్రశ్నలకు జగన్ నుంచి ఇంతవరకు సమాధానం రాలేదు. మళ్లీ మరో ఏడు ప్రశ్నలు సంధిస్తున్నా…‌జగన్ దమ్ముంటే వీటికి సమాధానం చెప్పాల‌న్నారు. అమరావతిని భ్రమరావతి అంటున్న జగన్ కు ఇప్పటి వరకు చేసిన నిర్మాణాలు కనిపించలేదా. రాజధాని రైతులకు క్షమాపణ చెప్పాలి. రాయలసీమను రతనాల సీమ గా చేసి చూపించాం. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో చేయలేని పని మేము చేసింది వాస్తవం కాదా. విజయవాడలో రెండు ఫ్లైఓర్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఘనత మాది. దీనిపై బురద జల్లడం ఎంత వరకు సబబు అని ప్ర‌శ్నించారు. బంద్ పేరుతో వైసిపి కార్యకర్తలు రోడ్ల పై ఉంటే జగన్ ఎసి టెంట్ లో సేద తీరారు. తిరుపతి లో బైక్ తగులపెట్టి అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం చేసింది నిజం కాదా అన్నారు. సోషల్  మీడియాలో అసత్య వీడియోలను పోస్ట్ చేసి అల్లర్లకు పాల్పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం మాదేనంటూ వైసిపి నేతలు దందాలు చేస్తూ డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. మార్నింగ్ వాక్‌లు, ఈవినింగ్ వాక్‌లు చేస్తున్న జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. నీ పాదయాత్రకు డబ్బులు ఇచ్చి జనాలను తీసుకువస్తున్నారు. ఫేక్ వీడియోలతో అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. సిఎం కుర్చీ మీద యావతో జగన్ భ్రమల్లో బతుకుతున్నాడ‌ని, ప్రత్యేక హోదా పక్షమా, మోడి పక్షమా అనేది జగన్ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ట్వీట్‌లలో కూడా చంద్రబాబుపై  విమర్శలు చేస్తూ మోదీపై జ‌గ‌న్ స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నాడ‌ని దేవినేని ఉమా పేర్కొన్నారు.

Just In...