Published On: Sat, Apr 21st, 2018

టిటిడి వేద పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

సెల్ఐటి న్యూస్‌, తిరుమ‌ల‌: టిటిడి వేద పాఠ‌శాల‌లో 2018 -19 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర వేద పాఠశాలలు, వేద విజ్ఞాన పీఠం, ధర్మగిరి, తిరుమల కీసరగుట్ట, కీసర మండలం, రంగారెడ్డి జిల్లా, చిలుకూరు, మోయింబాద్‌ మండలం, రంగారెడ్డి జిల్లా,  ఐ. భీమవరం, ఆకివీడు మండలం, పశ్చిమగోదావరి జిల్లా, విజయనగరం, నల్గొండ, కోటప్పకొండ, గుంటూరు జిల్లాల నందు వేద పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలో వివిధ కోర్సులలో ప్రవేశం కొరకు అర్హులైన బాలుర నుండి టిటిడి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  వైదిక సాంప్రదాయం ప్రకారం ఉపనయనం కాబడి మరియు నిర్ణీత వయస్సు మరియు విద్యా ప్రమాణాలు కలిగిన వారు ఇందుకు అర్హులు. 2018, జూన్‌ 15వ తేది లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  పైన తెలిపిన పాఠశాలలో వివిధ కోర్సుల వివరాలు, అర్హత మరియు దరఖాస్తు ఫారం ఇతర వివరాలకు www.tirumala.org / www.tirupati.org టిటిడి వెబ్‌సైట్‌లను సంప్రదించాల‌ని కోరింది.

Just In...