Published On: Tue, May 15th, 2018

సీఎం చంద్రబాబును కలిసిన అనిల్‌ అంబానీ

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ప్రముఖ వ్యాపారవేత్త అనిల్‌ అంబానీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కృష్ణపట్నంలో పవర్‌ప్లాంట్‌ ఏర్పాటు ప్రతిపాదనలపై వారి మధ్య చర్చ జరిగిన‌ట్లు విశ్వ‌స‌నీయ సమాచారం. ఈ సందర్భంగానే నవ్యాంధ్ర రాజధాని అమరావతిని బ్లూ, గ్రీన్‌ ఫీల్డ్‌ రాజధానిగా తీర్చిదిద్దుతామన్న ముఖ్యమంత్రి చంద్ర‌బాబును ఆయన అభినందించారు. నిర్మాణ ప్రణాళికలు, భవన ఆకృతులు, రహదారులు, ఉద్యానవనాలు చాలా బాగున్నాయని కితాబిచ్చారు. దేశంలోని రాజధానుల కంటే మంచిగా ప్రపంచస్థాయి నిర్మాణానికి చేస్తున్న ఆలోచనలు, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టడాన్ని అనిల్‌ అంబానీ ప్రశంసించారు.

Just In...