Published On: Wed, May 16th, 2018

తిరుమ‌ల శ్రీవారికి రూ.1.60 కోట్ల విరాళం

సెల్ఐటి న్యూస్‌, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి బుధవారం ఉదయం హైదరాబాద్‌కు చెందిన ఆర్‌.ఎస్‌. బ్రదర్స్‌, సౌతిండియా షాపింగ్‌మాల్‌ యజమానులు రూ.1.60 కోట్ల విరాళాన్ని అందజేశారు. సంస్థ యజమానులు పి.వెంకటేశ్‌, రాజమౌళి, ప్రసాద్‌, సత్యనారాయణ బుధవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వారందరూ కలిసి విరాళానికి సంబంధించిన డీడీలను తిరుమల జేఈవో శ్రీనివాసరాజుకు అందజేశారు. ఈ మొత్తాన్ని బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టు కింద డిపాజిట్‌ చేయాలని దాతలు సూచించారు. వీరు గతంలోనూ రూ.4కోట్ల విరాళాన్ని స్వామివారికి సమర్పించారు.

Just In...