Published On: Fri, May 18th, 2018

స‌త్ఫ‌లితాల్నిస్తున్న మేము సైతం కార్య‌క్ర‌మం

* పౌష్టికాహారంలో మొద‌టి స్థానంలో కృష్ణా

* అధికారుల‌తో టెలీకాన్ఫ‌రెన్స్‌లో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీకాంతం

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: మేము సైతం కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తు ఆరోగ్యవంతమైన చిన్నారులు కలిగిన జిల్లాగా కృష్ణాజిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం అన్నారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం గురువారం ఉదయం స్త్రీ, శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ల‌క్ష్మీకాంతం మాట్లాడుతూ జిల్లాలో ప్రత్యేకంగా చెప్పట్టిన మేము సైతం కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తుందన్నారు. దాతల సహకారంతో అంగన్ వాడి కేంద్రాల ద్వారా గర్భీణీ స్త్రీలకు, బాలింతలకు, పిల్లలకు అదనపు పౌష్టికాహారాన్ని అందించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. రాష్ట్ర స్థాయిలో విడుదల చేసిన నివేదికను 5.38 శాతం నమోదు కావడం జరిగిందన్నారు. జిల్లాలో 2,00,672 మంది పిల్లలను కొలమానం ఆదారంగా 10,802 మంది మాత్రమె ఎత్తుకు తగ్గ బరువు కలిగి ఉండి రాష్ట్రంలోనే అతి తక్కువగా 5.38 శాతం తీసుకురాగలిగామన్నారు. జిల్లాలో బరువు తక్కువ 2,00,549 పిల్లలను కొలమానం ఆధారంగా కొలిస్తే 12,201 మంది నమెదు కాబడి 6.08 శాతం మాత్రమే తక్కువ నమోదు కాబడి రాష్ట్రంలోనే అతి తక్కువ ఎత్తుకు తగ్గ బరువు, బరువు తక్కువ చిన్నారులు కలిగిన జిల్లాగా నమెదు కాబడిందని ఇందుకు స్త్రీ, శిశు సంక్షేమం అదికారులను అభినందిస్తున్నట్లు కలెక్టర్‌ అన్నారు. పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా జిల్లాలో తక్కువ బరువు కలిగిన పిల్లల శాతం 6.08 శాతానికి తీసుకురాగలిగామని అమలులో 13 జిల్లాల కంటే కృష్ణాజిల్లా మొదటి స్థానంలో నిలిచిందని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం పేర్కొన్నారు.

Just In...