Published On: Thu, Jul 12th, 2018

గుంటూరు నిర‌స‌కారుల‌పై పోలీసుల లాఠీఛార్జ్‌

* సీపీఎం నేత మధు అరెస్ట్

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును గుంటూరులో పోలీసులు అరెస్టు చేశారు. పాతగుంటూరు పోలీస్‌స్టేషన్‌పై దాడి ఘటనకు సంబంధించి కొందరు అమాయకులపై పోలీసులు కేసులు పెట్టారంటూ బాధితులను పరామర్శించేందుకు సీపీఎం నేత పి.మధు గురువారం గుంటూరులో పర్యటించారు. దీంతో పోలీసులు ఆయన‌ను బ‌ల‌వంతంగా అదుపులోకి తీసుకున్నారు. మధును అరెస్టు చేసే క్రమంలో నిరసనకారులు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. వాహనాలు వెళ్లకుండా నిరసనకారులు రోడ్డుపై బైటాయించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. కొందరు యువకులపై పోలీసులు చేయిు చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ యువకుడు స్పృహ తప్పి ప‌డిపోగా అతనిని ఆస్పత్రికి తరలించారు. అరెస్టు చేసిన వామపక్ష నాయకులు, కార్యకర్తలను నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నగరంలో సెక్షన్ 30, 144 అమల్లో ఉన్నందున మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసు అధికారులు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారంటూ వామపక్ష నాయకులు తీవ్ర‌స్థాయిలో మండిపడ్డారు.

Just In...