Published On: Sun, Jun 28th, 2020

6,790 లీటర్ల నాటు సారా ఊట ధ్వంసం..

* స్పెష‌ల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విస్తృత దాడులు

* అక్రమ మద్యంపై అనంత‌పురం జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్

* 6,790 లీటర్ల నాటు సారా ఊట ధ్వంసం, 26 మంది అరెస్టు

* 1446 టెట్రా పాకెట్లు, 39 మద్యం సీసాలు, 121 లీటర్ల నాటు సారా పట్టివేత

అనంత‌పురం క్రైం, సెల్ఐటి న్యూస్‌: అక్రమ మద్యం నియంత్రణకు ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో ఆదివారం అనంతపురం జిల్లాలో విస్తృత దాడులు జరిగాయి. జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు ఆదేశాలు మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్పెషల్ ఆఫీసర్ జె.రామమోహనరావు సారథ్యంలో పోలీసు బృందాలు ఆదివారం జిల్లా అంతటా దాడులు నిర్వహించారు. నాటు సారా తయారీ స్థావరాలు, విక్రయాలు… అక్రమ మద్యం రవాణా, విక్రయాలు, ఇసుక అక్రమ రవాణాలపై ప్రత్యేక నిఘా వేసి దాడులు చేశారు. నాటు సారా తయారీదారులు, విక్రేతలు మరియు మద్యం అక్రమ రవాణాదారులు మొత్తం 26 మందిని అరెస్టు చేశారు. ఈ క్ర‌మంలో 6,790 లీటర్ల నాటు సారా ఊట ధ్వంసం చేశారు. 1446 టెట్రా పాకెట్లు, వివిధ బ్రాండ్లకు చెందిన 39 మద్యం సీసాలు, 121 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు.

Just In...