Published On: Wed, Oct 31st, 2018

స‌త్ఫ‌లితాల్నిస్తున్న మంత్రి గంటా మ‌లేషియా ప‌ర్య‌ట‌న‌

* మ‌లేషియా కేంద్ర విద్యాశాఖ డిప్యూటీ మంత్రి వైబీ తీయోనీ చింగ్‌తో మంత్రి గంటా భేటీ

* రెండో రోజూ మ‌లేషియాలో కొనసాగిన‌ మంత్రి గంటా బృందం అధికారిక ప‌ర్య‌ట‌న‌

* విద్యార్థులు, ఫ్యాక‌ల్టీ ఎక్చేంజ్ ప్రోగ్రాంల‌పై చ‌ర్చ‌

* ఫ్యాక‌ల్టీ ఎక్చేంజ్, ప‌రిశోధ‌న అంశాల్లో ఇస్లామిక్ ఇంట‌ర్నేష‌న్ విశ్వ‌విద్యాల‌యంతో ఎంఓయూ

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ప‌రిశోధ‌న రంగంలో ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకోవ‌డం, విద్యార్థులు, ఫ్యాకల్టీ ఎక్చేంజ్ ప్రోగ్రాంలు చేసుకొనే దిశ‌గా అడుగులు వేయాల‌ని మ‌లేషియా విద్యాశాఖ డిప్యూటీ మంత్రి వైబీ తీయోనీ చింగ్, ఏపీ మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావు కాంక్షించారు. ఈ మేర‌కు కౌలాలంపుర్‌లోని ఆ దేశ విద్యాశాఖ కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశంలో ఇరు ప్ర‌భుత్వాల మ‌ధ్య సుత్రాప్రాయ అవ‌గాహ‌న ఒప్పందం కుదిరింది. అంత‌ర్జాతీయ స్థాయిలో విద్యాప్ర‌మాణాలు రాష్ట్రంలో నెల‌కొల్ప‌డ‌మే ధ్యేయంగా.. మ‌లేషియాలో ప‌లు వ‌ర్శ‌టీల‌ను అధ్య‌య‌నం చేస్తున్న మంత్రి గంటా బృందం మంగ‌ళవారం ఆ దేశ విద్యాశాఖ డిప్యూటీ మంత్రితో స‌మావేశ‌మైంది. విద్యార్థులు, ఫ్యాక‌ల్టీ ఎక్చేంజ్ ప్రోగ్రాంల నిర్వ‌హ‌ణ‌, ప‌రిశోధ‌న రంగంలో భాగ‌స్వామ్యం, ఎక్చేంజ్ ప్రోగ్రాంలో భాగ‌స్వామ్య‌మ‌య్యే విద్యార్థుల‌కు స్కాల‌ర్ షిప్పులు, గ్రాంట్లు అంశంపై విస్త్రత చ‌ర్చ జ‌రిగింది. ప‌రిశోధ‌న రంగంలో స‌హ‌కారం అందించి మ‌రింత ముందుకు వెళ్లే దిశ‌గా మ‌లేషియా విద్యాశాఖ మంత్రి ఆస‌క్తి క‌న‌బ‌రిచారు. మ‌లేషియా విద్యలో ప్ర‌వేశ‌పెట్టిన నూత‌న సంస్క‌ర‌ణ‌లను ఆ దేశ‌  విద్యాశాఖ మంత్రి వైబీ తీయో నీ చింగ్ ఈ సంద‌ర్భంగా వివ‌రించారు. న‌వ్యాంధ్ర‌లో సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో చేప‌డుతున్న వినూత్న సాంకేతిక సంస్క‌ర‌ణ‌ల‌ను మంత్రి గంటా శ్రీనివాస‌రావు  వివ‌రించారు. రాష్ట్రాన్ని సంద‌ర్శించాల‌ని విద్యాశాఖ డిప్యూటీ మంత్రి చింగ్‌ను మంత్రి గంటా ఆహ్వానించ‌గా త‌ప్ప‌నిస‌రిగా న‌వ్యాంధ్ర‌ను సంద‌ర్శించి, వివిధ అంశాల్లో ఎంఓయూలు దిశ‌గా ముందుకెళ్దామ‌ని చింగ్ అన్నారు. అనంత‌రం ఇంట‌ర్నేష‌నల్ ఇస్లామిక్ యూనివ‌ర్శ‌టీ సీఈవో షంషేర్ బిన్ హ‌రాన్‌తో మంత్రి గంటా స‌మావేశ‌మ‌య్యారు. ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. వ‌ర్శ‌టీలో నిర్వ‌హిస్తున్న కోర్సులు, సంస్క‌ర‌ణ‌లు, సాంకేతిక సంస్క‌ర‌ణ‌లు త‌దిత‌ర అంశాల‌ను ప‌రిశీలించారు. ఫ్యాక‌ల్టీ ఎక్చేంజ్, ప‌రిశోధ‌న అంశాల్లో  ఇస్లామిక్ ఇంట‌ర్నేష‌న్ విశ్వ‌విద్యాల‌యంతో ఈ సంద‌ర్బంగా సూత్రాప్రాయ ఒప్పందం కుదిరింది.  మంత్రి గంటా బృందంలో విక్ర‌మ‌ సింహపురి వ‌ర్శ‌టీ వైస్ చాన్స‌ల‌ర్ ఆర్.సుద‌ర్శ‌నరావు, ఎపి ఉన్న‌త విద్యాశాఖ స‌ల‌హాదారు డాక్ట‌ర్ ఈద‌ర వెంక‌ట్ త‌దిత‌రులు ఉన్నారు.
 

Just In...