Published On: Thu, Nov 1st, 2018

అగ్నిప్రమాదంలో పూరిళ్లు దగ్దం

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క్రైం: ప్రమాదవశాత్తూ అంటుకున్న మంటలకు కృష్ణా జిల్లాలోని మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం జి.కొండూరు మండల పరిధిలోని కోడూరు శివారు గ్రామం కండ్రికలో రెండు ఇళ్లు గురువారం దగ్దం అయ్యాయి. గర్నెపూడి చలపతిరావు, దుర్గారావు అనే ఇద్దరు అన్నదమ్ముల ఇళ్లు పూర్తిగా దగ్దమయ్యాయి. ఈ ప్రమాదంలో దుర్గారావుకు చెందిన రూ.96,260, 5 కాసుల బంగారం, చలపతిరావుకు చెందిన రూ.78 వేలు, ఇళ్లలోని వస్తువులు, బట్టలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదానికి గల కారణాల‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Just In...