Published On: Wed, Nov 21st, 2018

ఆక‌తాయిల‌కు కౌన్సెలింగ్‌..

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క్రైం: న‌గ‌రంలోని ప‌లు కూడ‌ళ్ల‌లో ఈవ్‌టీజింగ్ చేస్తూ ప‌ట్టుబ‌డిన 51 మంది ఆక‌తాయిల‌కు మ‌హిళా పోలీస్‌స్టేష‌న్‌లో బుధ‌వారం కౌన్సెలింగ్ నిర్వ‌హిస్తున్న మ‌హిళా పోలీస్‌స్టేష‌న్ ఏసీపీ వి.వి.నాయుడు. కౌన్సెలింగ్‌లో మ‌హిళా మిత్ర కౌన్సిల‌ర్లు, మ‌హిళా ర‌క్ష‌క్ సిబ్బంది పాల్గొన్నారు. చ‌ట్టాల‌పై వారికి అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతో పాటు ఈవ్‌టీజింగ్‌కు పాల్ప‌డ‌టం కార‌ణంగా విద్యార్థి ద‌శ నుండే జీవితాలు నాశ‌న‌మ‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని, మ‌రోసారి ఈవ్‌టీజింగ్‌కు పాల్ప‌డితే కేసులు న‌మోదు చేయ‌డంతో పాటు చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని వారిని హెచ్చ‌రించారు.

Just In...