Published On: Fri, Nov 23rd, 2018

ఆటో బోల్తా ప‌డి 15 మంది కూలీల‌కు గాయాలు

* ముగ్గురికి తీవ్ర‌గాయాలు

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క్రైం: కృష్ణా జిల్లా గ‌న్నవరం మండలం గొల్లనపల్లి వద్ద పత్తి కూలీల ఆటో బోల్తా ప‌డి 15 మందికి గాయాల‌య్యాయి. వీరిలో ముగ్గురికి తలకు బలమైన గాయాల‌య్యాయి. గాయపడినవారు ఉంగుటూరు మండలం నాగవరప్పాడు గ్రామాకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వెంట‌నే వారిని 108 అంబులెన్సులో చిన ఆవుటపల్లిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. అంబులెన్స్ ఈ.ఎన్. టి,పి. నగేష్, పైలెట్ ఎం.సాయిలు ప్రదమ చికిత్స నిర్వహించారు. రోడ్డు దాటుతున్న గెదెను తప్పించోబోయి ఆటో బోల్తా ప‌డిన‌ట్లు కూలీలు తెలిపారు. గాయపడిన వారిలో ఎస్‌.కె.సకీన, కూరాకుల రమాదేవి, ఎస్‌.కె.నబీల, కీళ్ళ శివమ్మా, దండుబోయిన య‌శోద, ఎస్‌.కె.షబీర, ఎస్‌.కె.ఖాసీంబీ, ఎస్‌.కె.శమీల ఉన్నారు. వారిలో సబీరా, ఖాసీంబీ, సమీలకు తలకు బలమైన గాయాలయ్యాయి.

Just In...