Published On: Wed, Dec 5th, 2018

ఏపీసీఆర్డీఏకు ఎలక్ట్రికల్ కార్లు అందజేసిన ఈఎస్ఎల్

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: భారత ప్రభుత్వ కంపెనీ ఎనర్జీ ఎఫీసియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఎస్ఎల్) తొలి విడతగా 5 ఎలక్ట్రిక్ కార్లను ఏపీసీఆర్డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్‌కు బుధవారం విజ‌య‌వాడ‌లోని ఏపీసీఆర్డీఏ కార్యాల‌యంలో అందజేశారు. ఏపీసీఆర్డీఏకు 35 ఎలక్ట్రిక్ కార్లను అందజేసేందుకు గతంలో ఈఎస్ఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా తొలివిడత కార్ల తాళాల‌ను చెరుకూరి శ్రీధర్‌కు ఈఎస్ఎల్ రీజినల్ హెడ్ శ్రీనివాసరావు అందజేశారు. ఈ సంద‌ర్భంగా అదనపు కమిషనర్ సగిలి షణ్మోహన్, కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ఎలక్ట్రికల్ కార్లను టెస్ట్ డ్రైవ్ చేశారు. మిగిలిన 30 కార్లను త్వరలోనే అందజేయాలని కమిషనర్ కోరారు. వారం పదిరోజుల్లో రెండో విడతగా మరికొన్ని కార్ల‌ను అందజేస్తామని ఈఎస్ఎల్ రీజినల్ హెడ్ శ్రీనివాసరావు తెలిపారు.

Just In...