Published On: Mon, Jan 7th, 2019

శ్రీవారి సేవ‌లో ప్ర‌ముఖులు

సెల్ఐటి న్యూస్‌, తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు సోమవారం ఉదయం దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌, తెరాస ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సినీ నటుడు నారా రోహిత్‌, రజనీకాంత్‌ సతీమణి లత, కుమార్తె ఐశ్వర్య వీరిలో ఉన్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వీరంతా శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆలయానికి చేరుకున్న జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌కు తితిదే అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ దంపతులకు పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ స్వామివారి తీర్థప్రసాదాలను, చిత్ర పటాన్ని అందజేశారు. ఏపీ హైకోర్టు ఏర్పాటైన తరువాత ప్రధాన న్యాయమూర్తి హోదాలో తొలిసారి స్వామివారి సేవలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఎమ్మెల్యే తలసాని శ్రీనివా స్‌ యాదవ్‌ స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రచారం తప్ప ఏపీలో అభివృద్ధి కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రంలో ధర్మపోరాట దీక్షలు, నవ నిర్మాణ దీక్షల పేరుతో ప్రజాదనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఏపీలో ప్రచారం చేస్తామని పేర్కొన్నారు.

Just In...