Published On: Tue, Feb 5th, 2019

అవ‌గాహ‌న‌తోనే ప్ర‌మాదాల నివార‌ణ‌

* డిప్యూటీ ట్రాన్స్ పోర్టు క‌మిష‌న‌ర్ మీరాప్ర‌సాద్

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డం ద్వారానే ర‌హ‌దారి ప్ర‌మాదాల‌ను త‌గ్గించ‌వ‌చ్చ‌ని ఉప ర‌వాణా క‌మిష‌న‌ర్ (డీటీసీ) మీరాప్ర‌సాద్ పేర్కొన్నారు. 30వ ర‌హ‌దారి భ‌ద్ర‌తా వారోత్స‌వాల ప్రారంభోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓన‌ర్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో బెంజిస‌ర్కిల్‌లోని అసోసియేష‌న్ హాలులో ర‌హ‌దారి భ‌ద్ర‌త‌పై రూపొందించిన బ్రోచ‌ర్‌ను ఆయ‌న ఆవిష్క‌రించారు. అసోసియేష‌న్ అధ్యక్షులు కోనేరు వెంక‌ట రామారావు అద్య‌క్ష‌త‌న జ‌రిగిన కార్య‌క్ర‌మంలో డీటీసీ మీరాప్ర‌సాద్ మాట్లాడుతూ ర‌హ‌దారి భ‌ద్ర‌తా నియ‌మాలు పాటించి రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌కు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని సూచించారు. వాహ‌న‌దారులే కాకుండా పాదాచారులు కూడా నియ‌మ, నిబంధ‌న‌లు పాటించాల‌న్నారు. ద్విచ‌క్ర‌వాహ‌న‌దారులు హెల్మెట్, కార్లు న‌డిపేవారు సీట్ బెల్టు ద‌రించ‌డం త‌ప్ప‌నిస‌రిగా విధిగా పాటించాల‌ని మీరా ప్ర‌సాద్ పేర్కొన్నారు. జాతీయ ర‌హ‌దారుల‌పై రోడ్డు ప‌క్క‌న నో పార్కింగ్ ప్లేస్ వాహ‌నాలు ఎట్టి ప‌రిస్థితుల్లో పార్కింగ్ చేయ‌కూడ‌ద‌ర‌న్నారు. రాంగ్ రూట్‌లో వెళ్ల‌డం ద్వారా ఎక్కువ ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌ని ప్ర‌మాదాల కారణాల‌పై అవ‌గాహ‌న పెంచుకొని రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌కు కృషి చేయాల‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లారీ ఓన‌ర్స్ అసోసియేష‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వై.వి.ఈశ్వ‌ర‌రావు మాట్లాడుతూ వాహ‌న‌దారులు జాగ్ర‌త్త‌గా నిబంధ‌న‌లు పాటిస్తూ వాహ‌నాలు న‌డ‌ప‌డం ద్వారా ప్ర‌మాదాల‌ను నివారించ‌వ‌చ్చ‌న్నారు. కార్య‌క్ర‌మంలో దికృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓన‌ర్స్ అసోసియేష‌న్ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి అడుసుమిల్లి స‌దాశివ‌రావు, ఆఫీసు బేర‌ర్లు, అసోసియేష‌న్ కార్య‌వ‌ర్గ స‌భ్యులు, త‌దిత‌రులు పాల్గొన్నారు. జాతీయ ర‌హ‌దారి భ‌ద్ర‌తా వారోత్స‌వాల్లో బాగంగా 6న సాయంత్రం 4గంట‌ల‌కు బెంజిస‌ర్కిల్‌లోని అసోసియేష‌న్ హాలు నుంచి స్వ‌రాజ్య‌మైదానం వ‌ర‌కు ర్యాలీ జ‌రుగుతుంద‌న్నారు.

Just In...