Published On: Tue, Feb 5th, 2019

ప్రాంగ‌ణ ఎంపిక‌ల్లో పీబీ సిద్ధార్థ విద్యార్ధుల‌కు ఉపాధి అవ‌కాశాలు

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల శిక్షణ ఉపాధి విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్ మరియు విశాఖ పట్టణం నగరాలలో తమ కార్యాలయాలకు చెందిన వివిధ విభాగాలలో ఉద్యోగాల భర్తీ కోసం ప్రముఖ ఔషధ తయారీ సంస్థ లారస్ లాబ్స్ ఇటీవల నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో తమ కళాశాలకు చెందిన 18 మంది డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులకు ఉపాధి అవకాశం కల్పించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్ సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. మూడు దశల్లో నిర్వహించిన ఈ ప్రాంగణ ఎంపికలలో రాత పరీక్ష, టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్ ఆర్ ఇంటర్వ్యూలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 18 మంది బిఎస్సి కెమిస్ట్రీ చివరి సంవత్సరం విద్యార్థులు ట్రైనీ కెమిస్టులుగా ఎంపికైనట్లు ఉపాధి విభాగం అధికారి కావూరి శ్రీధర్ చెప్పారు. త్వరలో వీరందరికీ నియామక పత్రాలు అందజేస్తారని డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షల అనంతరం విశాఖ పట్టణంలోని లారస్ కార్యాలయంలో ఈ విద్యార్థులకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులను కళాశాల యాజమాన్యం తరఫున సిద్ధార్థ అకాడమీ అధ్యక్ష కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వర్లు, పాలడుగు లక్ష్మణరావు, కోశాధికారి సూరెడ్డి వెంకటేశ్వరరావు, కన్వీనర్ పి.ఎల్.ఎన్.ప్రసాద్‌, కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు, డీన్ రాజేష్ సి జంపాల, రసాయనశాస్త్ర విభాగ అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.

Just In...