Published On: Fri, Feb 8th, 2019

సిఎస్ అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీ సమావేశం

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీ సమావేశం శుక్రవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర‌ పునేఠ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపనకు సంబంధించిన అనుమతులు, వివిధ రాయితీలు మంజూరు తదితర అంశాలపై సమీక్షించారు. ముఖ్యంగా పరిశ్రమల ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీకి సంబంధించి తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురం వద్ద ఏర్పాటు చేస్తున్న కాస్టిక్ సోడా తయారీ యూనిట్ అంశం, కృష్ణా జిల్లా మల్లవల్లి వద్ద ఏర్పాటు చేసిన మోహన్ స్పిన్ టెక్స్ ఇండియా  లిమిటెడ్,డోయర్ మెరైన్ ఇండియా ప్రవేట్ లిమిటెడ్‌నకు సంబంధించిన అంశాలపై చర్చించారు. స్పష్టమైన ప్రతిపాదనలతో ఎక్కువ మందికి ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉండి ముందుకు వచ్చే వారికి సకాంలో తగిన అనుమతులు, వివిధ రాయితీలు కల్పించడం ద్వారా వెంటనే పరిశ్రమలు స్థాపనకు తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ అనిల్‌చంద్ర పునేఠ అధికారులకు స్పష్టం చేశారు. సమావేశంలో పరిశ్రమల స్థాపనకు సంబంధించిన వివిధ అంశాలపై సమీక్షించారు. సమావేశంలో ఇంధన, ఐటి శాఖల ముఖ్య కార్యదర్శులు అజయ్ జైన్, విజయానంద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్య రాజ్, పరిశ్రమల శాఖ కమీషనర్ సిద్ధార్ధ జైన్, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
విజన్ 2019-24 అంశంపై అసెంబ్లీలో లఘ చర్చ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విజన్ 2019-24 డాక్యుమెంట్ అంశంపై అసెంబ్లీ సమావేశాలు చివరి రోజైన శుక్రవారం అసెంబ్లీలో సుదీర్ఘమైన చర్చ జరిగింది.
ఈ విజన్ డాక్యుమెంట్‌పై జరిగిన చర్చలో పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడారు..
అమలాపురం ఎంఎల్ఏ అయితా బత్తుల ఆనందరావు..
* 7మిషన్లు, 5గ్రిడ్లు, 4క్యాంపెయిన్ల ద్వారా విజన్ 2020-24 లక్ష్య సాధనకు కృషి
* నేడు విద్యుత్ మిగులుతో మెరుగైన అభివృద్ధి సాధింగలిగాం
* డ్వాక్రా సంఘాలకు పెద్దఎత్తున చేయూతనివ్వడంతో పేదరిక నిర్మూలనకు అవకాశం
* 2020కి దేశంలో 3 ఉత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా, 2020కి దేశంలో మొదటి ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దడంతో పాటు 2050 ప్రపంచంలోని ఉత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా చేయాలన్నదే విజన్ డాక్యుమెంట్ లక్ష్యం
చిత్తూర్ జిల్లా సత్యవేడు ఎంఎల్ఏ ఆదిత్య…
* ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రపంచంలోనే ఉత్తమ రాజధానిని ఇక్కడ నిర్మిస్తున్నాం
* పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయంల రాష్ట్రాన్ని ప్రపంచానికే ఆదర్శం చేయనున్నాం
విశాఖ జిల్లా ఎంఎల్ఏ విష్టుకుమార్ రాజు…
* మంచి విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించినందకు ప్రభుత్వానికి అభినందలు
* ఈ డాక్యుమంట్ ప్రకారం ప్రస్తుతం కృష్ణా జిల్లా ప్రధమ, విశాఖ జిల్లా ద్వితీయ స్థానంలో నిలవడం అభినందనీయం
* రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు ఇంక పటిష్టమైన చర్యలు చేపట్టాలి
* ఇసుక కుంభకోణం,గనుల అక్రమ మైనింగ్ పై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు
* విశాఖ భూకుంభకోణంపై సిట్ విచారణ చేసినా దానిపై తదుపరి చర్యలు లేవు
* రాష్ట్రంలో గృహ నిర్మాణ పధకాలు బాగున్నాయని అయితే 2015 జూలైలో ప్రధాన మంత్రి నరేంద్ర మోది అందరికీ ఇళ్లు అనే నినాదం ఇళ్లు నిర్మాణం చేపట్టారని గుర్తు చేశారు
* విశాఖ రైల్వే జోన్ సాధించేందుకు తుది వరకూ నా వంతు ప్రయత్నం సాగిస్తాను

Just In...