Published On: Wed, Feb 13th, 2019

రూ.120.40 కోట్లతో గిరి ఫుడ్ బాస్కెట్లు

* సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గిరి ఆహార పోషక పథకం ప్రారంభం

* 2.06 లక్షల గిరిజన కుటుంబాలకు లబ్ధి

* ప్రతి నెలా 6 రకాల నిత్యావసర వస్తువుల పంపిణీ

* ఒక్కో బాస్కెట్ విలువ రూ.500

* మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ వెల్లడి

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజన కుటుంబాలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు గిరి ఆహార పోషక పథకాన్ని (పుడ్ బాస్కెట్) రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింద‌ని ఈ సంద‌ర్భంగా బుధవారం సచివాలయంలోని సీఎం కార్యాలయంలో గిరి ఆహార పోషక పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించినట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ, ప్రాథమిక ఆరోగ్య శాఖ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ తెలిపారు. సచివాలయంలో విలేకరులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ గిరిజన ఆహార పోషక పథకం ద్వారా రూ.500 విలువైన రెండు కిలోల చొప్పున కందిపప్పు, రాగి పిండి, బెల్లం, వేరుశనగలు, డబుల్ పోర్టిఫైడ్ సాల్ట్ కిలో చొప్పున, లీటర్ సన్ ప్లవర్ ఆయిల్ వంటి ఆరు నిత్యావసర వస్తువులతో కూడిన సంచిని ప్రతి నెలా పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రూ.120.40 కోట్లతో అమలుచేస్తున్న ఈ పథకం ద్వారా 2,00,668 లక్షల గిరిజన కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. జాతీయ పౌష్టికాహార సంస్థ సిపార్సుల మేరకు. గిరి ఆహార పోషక పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.  అనంతరం మంత్రి శ్రావణ్ కుమార్ లబ్ధిదారులకు గిరి ఆహార పోషక సంచులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డైరక్టర్ గంధం చంద్రుడు, గిరిజన సంక్షేమం ఏడీ చిన వీరభద్రుడు, గిరిజన సంక్షేమ శాఖ డిడిలు చంద్రిక, చిన్నబాబు, మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Just In...