Published On: Tue, Feb 26th, 2019

విజ‌య‌వాడ‌లో స‌వ్య‌సాచి జావా షోరూం ప్రారంభం

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: న‌వ్యాంధ్ర రాజ‌ధాని ప్రాంత‌మైన విజ‌య‌వాడ‌లోని వెట‌ర్న‌రి కాల‌నీలో తొలిసారిగా ద్విచ‌క్ర వాహ‌నాల్లో అగ్ర‌గామిగా ఉన్న స‌వ్య‌సాచి జావా షోరూంను మంగ‌ళ‌వారం ఉద‌యం వైసీపీ నాయ‌కుడు పోతిన వెంక‌ట ప్ర‌సాద్ ముఖ్య అతిథిగా హాజ‌రై లాంఛ‌నంగా ప్రారంభించారు. అనంత‌రం జావా ద్విచ‌క్ర వాహ‌నాల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మొద‌టిసారిగా మార్కెట్‌లోకి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా పోతిన వెంక‌ట ప్ర‌సాద్ మాట్లాడుతూ జావా వాహ‌నాల‌ను స‌వ్య‌సాచి మోటార్స్ ద్వారా విడుద‌ల చేసిన‌ట్లు తెలిపారు. యువ‌త‌ను ఎక్కువ‌గా ఆక‌ట్టుకునే విధంగా జావా వాహ‌నాల‌ను రూపొందించ‌డం జ‌రిగింద‌ని, అందువ‌ల్ల ప్ర‌జాధ‌ర‌ణ ఎక్కువ‌గా ఉంద‌న్నారు. త్వ‌ర‌లోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్ర‌ముఖ ప‌ట్ట‌ణాల్లో జావా వాహ‌నాల డీల‌ర్‌షిప్‌ను విస్త‌రించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ఇప్ప‌టికే బుకింగ్స్ ప్రారంభ‌మ‌య్యాయ‌ని ఆస‌క్తి ఉన్న‌వారు సవ్య‌సాచి మోటార్స్‌ను సంప్ర‌దించాల‌ని కోరారు. కార్య‌క్ర‌మంలో వైసీపీ నాయ‌కులు బొప్ప‌న భ‌వ‌కుమార్‌,  ప‌లువురు న‌గ‌ర ప్ర‌ముఖులు పాల్గొన్నారు.

Just In...