Published On: Tue, Apr 9th, 2019

వేసవి దృష్ట్యా చేయవలసినవి మరియు చేయకూడనవి

* రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది 

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: అధిక ఉష్టోగ్రత, వేడిగాలుల పరిస్థితుల వల్ల శారీరక అలసట కలిగి తద్వారా మరణాలు సంభవించవచ్చు. వేడిగాలుల ప్రభావాన్ని తగ్గించేందుకు, వడదెబ్బ వల్ల తీవ్ర అనారోగ్యాన్ని లేదా మరణాన్ని నిరోధించేందుకు మీరు దిగువ చర్యలను తీసుకోవచ్చు. ఎండలో ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటలు మరియు 3 గంటల మధ్య బయటకు వెళ్ళవద్దు. దాహం లేకపోయినప్పటికి తరచుగా తగినంత నీరు త్రాగండి. ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు తేలికైన, రంగు తక్కువ ఉన్న, వదులైన, సూక్ష్మ రంధ్రములు గల నూలు దుస్తులు ధరించాలి. రక్షణగా చలువ అద్దాలు, గొడుగు/టోపి, షూస్ లేదా చెప్పులు ధరించాలి. బయటి ఉష్టోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు బరువైన పనులు చేయవద్దు. మధ్యాహ్నం 12 గంటల నుండి         3 గంటల మధ్య బయట పనులు చేయవద్దు.  ప్ర‌యాణించేటప్పుడు మీ వెంట త్రాగునీటిని ఉంచుకోండి. ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బొనేటెడ్ సాప్ట్ డ్రింక్స్ త్రాగడాన్ని నివారించండి. ఇవి శరీరంలో నీటి పరిమాణాన్ని తగ్గిస్తాయి.
 •  ప్రొటీన్లు అమితంగా ఉండే ఆహారాన్ని మరియు నిల్వ ఉన్న ఆహారాన్ని తినవద్దు.
 •  మీరు వెలుపల పనిచేస్తున్నట్లయితే టోపిని లేదా గొడుగును ఉపయోగించండి. మీ తల, మెడ, ముఖం, అవయవాలపై తడి బట్టను ఉంచండి.
 •  పార్కు చేసిన వాహనాలలో పిల్లలను లేదా పెంపుడు జంతువులను ఉంచరాదు.
 •  మీకు మూర్చ వస్తున్నట్లు లేదా అనారోగ్యంగా ఉన్నట్లు అనిపించినట్లయితే వెంటనే వైద్యుని దగ్గరకు వెళ్ళండి.
 •  ఓఆర్¬ఎస్, లస్సీ, టోరని (రైస్ వాటర్) నిమ్మరసం, మజ్జిక వంటి గృహ తయారీ పానీయాలను త్రాగండి. ఇవి మీ శరీరానికి తగినంత నీటిని అందిస్తాయి.
 •  పశువులను పాకలో ఉంచాలి. త్రాగడానికి తగినంత నీటిని అందుబాటులో ఉంచాలి.
 •  మీ ఇంటిలో చల్లదనం ఉండేలా చూడండి. కర్టెన్లు, షట్టర్లు లేదా సన్¬షేడ్లు ఉపయోగించండి. రాత్రి సమయంలో కిటికీలను తెరిచి ఉంచండి.
 •  ఫ్యాన్లను, తడిబట్టలను ఉపయోగించండి. తరచుగా చల్లని నీటితో స్నానం చేయండి.
వడ దెబ్బ తగిలిన వ్యక్తికి చికిత్స కోసం చిట్కాలు
 • వడ దెబ్బ తగిలిన వ్యక్తిని నీడ క్రింద చల్లని ప్రదేశంలో ఉంచాలి. తడి గుడ్డను కప్పాలి/తరచుగా శరీరాన్ని తడి గుడ్డతో తుడవాలి.
 • సాధారణ ఉష్టోగ్రతగల నీటిని తల మీద పోయాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే, శరీర ఉష్టోగ్రతను తగ్గించడంపై తగిన శ్రద్ద చూపాలి.
 • శరీరానికి తగినంత నీటిని అందించేందుకు ఉపయోగపడే ఓఆర్¬ఎస్ లేదా లెమన్ షర్బత్/టోరని (రైస్ వాటర్) లేదా మరేదైన ఆ వ్యక్తికి ఇవ్వవచ్చు.
 • ఆ వ్యక్తిని దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి తీసుకుని వెళ్ళాలి. వడదెబ్బ ప్రాణాంతకమైనది కావడం వల్ల రోగిని తక్షణమే ఆసుపత్రిలో చేర్చి, వైద్య చికిత్స చేయడం అవసరం.
పరిసరాలను అనుకూలంగా మలచుకోవడం
 • చల్లని వాతావరణం నుండి వేడి వాతావరణంలోకి వచ్చే వ్యక్తులకు ఈ వడ దెబ్బ సమస్య ఏర్పడవచ్చు. వేసవికాలంలో అటువంటి వ్యక్తులు మీ ఇంటికి రావచ్చు. శరీరం వేడిని తట్టుకుని పరిసరాలు అనుకూలంగా ఉండే వరకు వారిని బయట తిరగనియ్యవద్దు. వారు నీటిని ఎక్కువగా తాగాలి. వేసవిలో వేడి వాతావరణాన్ని క్రమంగా తట్టుకోవడం ద్వారా పరిసరాలను అనుకూలంగా మలచుకోవచ్చును.

Just In...