Published On: Thu, Apr 11th, 2019

పందెంకోళ్లు ఎదురుప‌డిన వేళ‌…!

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా గురువారం ఉద‌యం విజ‌య‌వాడ‌లో అరుదైన స‌న్నివేశం చోటుచేసుకుంది. ఎన్నిక‌ల స‌ర‌ళి ప‌రిశీల‌నలో భాగంగా తెదేపా, వైసీపీ ఎంపీ అభ్య‌ర్థులు కేశినేని శ్రీనివాస్ (నాని), పొట్లూరి వీర‌ప్ర‌సాద్‌లు విజ‌య‌వాడ మొగ‌ల్రాజ‌పురంలోని పీబీ సిద్ధార్థ క‌ళాశాల‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఒకేసారి ఎదురెదురుగా తార‌స‌ప‌డ్డారు.. సాధార‌ణంగా ఇటువంటి సంద‌ర్భాల్లో గౌర‌వంగా ప‌ల‌క‌రించుకుంటార‌ని అక్క‌డ ఉన్న ఓట‌ర్లు భావించారు.. కానీ ఇందుకు భిన్నంగా వారివురూ ఎటువంటి హావ‌భావాలు లేకుండా నిర్వికారంగా చూసుకోవ‌డంతో ఓట‌ర్లు నిర్ఘాంత‌పోయారు..

Just In...