Published On: Fri, Apr 12th, 2019

ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి..

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికలు మరోసారి పైచేయి సాధించారు. ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి సచివాలయంలో శుక్ర‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో  విడుదల చేశారు. ఇంటర్మీడియట్ రెండో ఏడాది జనరల్ లో 4,31,739 మంది పరీక్షలకు హాజరుకాగా, అందులో 3,09,613 మంది ఉత్తీర్ణులు అయ్యారు.  ద్వితీయ సంవత్సరంలో 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.  ఒకేషనల్ లో 26,652 మందిలో 18,409 మంది, అంటే 69 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణులు అయ్యారు. మొదటి సంవత్సరం జనరల్ 60, ఒకేషనల్ 49 శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి ప్రకటించారు. పరీక్షలు పూర్తయిన 25 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించారు. మొదటి సారి గ్రేడింగ్ విధానంలో ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కృష్ణా జిల్లా 72 శాతం రెండో సంవత్సరం 81 శాతంతో మొదటి స్థానంలో, పశ్చిమగోదావరి మొదటి సంవత్సరం 69, చిత్తూరు 76 శాతంతో ద్వితీయ స్థానంలో నిలిచాయి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో నెల్లూరు 67 శాతం, ద్వితీయ సంవత్సరంలో నెల్లూరు, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలు 74 శాతంతో తృతీయ స్థానంలో నిలిచాయి. మొదటి సంవత్సర ఫలితాల్లో కడప, అనంతపురం శ్రీకాకుళం జిల్లాలు చివరి స్థానాల్లో నిలిచాయి. రెండో సంవత్సర ఫలితాల్లో కడప శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు చివరి స్థానాల్లో నిలిచాయి.
                  ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్ధులు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో విజయనగరం 59 శాతం, నెల్లూరు 55 శాతం, శ్రీకాకుళం జిల్లాలు 52 శాతంతో మొదటి మూడు స్థానాలు సాధించాయి. ద్వితీయ సంవత్సరంలో విజయనగరం 77 శాతం, చిత్తూరు 70, కర్నూలు, ప్రకాశం జిల్లాలు 69 శాతంతో మొదటి మూడు స్థానాలు సాధించాయి.
   ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రభుత్వ కళాశాలల్లో విశాఖపట్నం 34 శాతం, గుంటూరు, అనంతపురం, తూర్పు గోదావరి 35 శాతం, కృష్ణా జిల్లాలు 38 శాతంతో చివరి స్థానాల్లో నిలిచాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో విశాఖపట్నం 57 శాతం, గుంటూరు 58, తూర్పు గోదావరి జిల్లాలు 60 శాతంతో చివరి స్థానంలో నిలిచాయి.
                   ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ఫలితాల్లో పశ్చిమ గోదావరి 53 శాతం, చిత్తూరు, కృష్ణా 51, కడప జిల్లాలు 41 శాతంతో అగ్ర స్థానంలో నిలిచాయి. ద్వితీయ సంవత్సరంలో చిత్తూరు జిల్లా 75 శాతం, కృష్ణా 68 శాతం, పశ్చిమ గోదావరి జిల్లాలు 65 శాతంతో అగ్ర స్థానంలో నిలిచాయి. ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో  ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాల్లో విజయనగరం 21 శాతం, ప్రకాశం 26, కర్నూలు జిల్లాలు 27 శాతంతో చివరి స్థానాల్లో నిలిచాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో విజయనగరం 35, తూర్పు గోదావరి 45 శాతం, నెల్లూరు జిల్లాలు 50 శాతంతో చివరి స్థానాల్లో నిలిచాయి. ఇంటర్మీడియట్   మొదటి సంవత్సరం జనరల్ లో 13,966 మంది పదికి పది జీపీఏ సాధించారు. ఒకేషన్ లో 7 మంది విద్యార్ధులు పదికి పది సాధించారు. ద్వితీయ సంవత్సరం జనరల్ లో 9,340 మంది, ఒకేషనల్ లో ముగ్గురు పదికి పది సీజీపీఏ సాధించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జనరల్ లో 64 శాతం మంది బాలికలు, ఒకేషనల్ లో 55 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులు అయ్యారు.  ద్వితీయ సంవత్సరం జనరల్ లో 75 మంది బాలికలు, ఒకేషనల్ లో 74 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. రీ కౌంటింగ్, రీ వాల్యూ కు ఏప్రిల్ 22 తేదీ వరకు ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి బి. ఉదయలక్ష్మి తెలిపారు.  అడ్వాన్స్డ్ సప్లమెంటరీకి ఏప్రిల్ 24 తేదీ వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుని, ఫీజు చెల్లించాలని ఆమె సూచించారు.  మే 14వ తేదీ నుంచి సంప్లమెంటరీ పరీక్షలు ప్రారంభం అవుతాయని ఇంటర్మీడియట్ బోర్డు  కార్యదర్శి ఉదయలక్ష్మి వెల్లడించారు.

Just In...