Published On: Mon, May 6th, 2019

పార్టీని మరింత పటిష్ఠం చేయడమే లక్ష్యం

* అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు 

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: సంస్థాగతంగా టీడీపీ బలమైన పునాదులతో కూడిన పార్టీ అని, క్రమశిక్షణకు మారు పేరు టీడీపీ అని సీఎం చంద్రబాబు కొనియాడారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సోమ‌వారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీని మరింత పటిష్ఠంగా రూపొందించడమే లక్ష్యమని, పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు ప్రాణాలకు తెగించి మరీ పని చేశారని కితాబునిచ్చారు. ప్రజలు అనేక అడ్డంకులను అధిగమించి ఓట్లేశారని, ప్రజాభిప్రాయం, కార్యకర్తల ఆమోదం మేరకే అభ్యర్థులను ఎంపిక చేశామని ఆయన స్పష్టం చేశారు. ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమం కలిసొచ్చాయని, 40 ఏళ్లలో చేయలేని పనులు ఐదేళ్లలో చేశామని బాబు ప్రకటించారు. సంక్షేమ నిధి ద్వారా కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు. పోలవరం చూసిన ఎవరైనా వేరే పార్టీకి ఓటేస్తారా? అని ప్రశ్నించారు. నాడు కాటన్ బ్యారేజీలు కట్టాడు కాబట్టే దేవుడయ్యాడని, అలాగే భావితరాలు కూడా టీడీపీ నిర్మాణాన్ని గుర్తుంచుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

Just In...