Published On: Sun, May 19th, 2019

ప‌దిలో ఎం.ఎస్‌.ఆర్‌. స్కూల్ విద్యార్థుల విజ‌య‌కేత‌నం

* స‌క్సెస్‌మీట్‌లో అభినందించిన ఉపాధ్యాయులు

సెల్ఐటి న్యూస్‌, పాత‌బ‌స్తీ: భ‌విష్య‌త్‌లో ఉన్న‌త శిఖ‌రాలు అధిరోహించ‌డ‌మే ఇటీవ‌ల విడుద‌లైన ప‌దొవ త‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాల్లో ల‌క్ష్యంగా త‌మ విద్యార్థులు ప‌దికి ప‌ది ఉత్తీర్ణ‌త శాతం సాధించి ఇత‌ర విద్యార్థుల‌కు స్ఫూర్తిగా నిలిచార‌ని మ‌ద్ది సుబ్బారావు ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ (ఎం.ఎస్.ఆర్‌) క‌ర‌స్పాండెంట్ కొల్లి నాగేశ్వ‌ర‌రావు తెలిపారు. ఈ విష‌య‌మై శ‌నివారం సాయంత్రం పాత‌బ‌స్తీలోని ఎం.ఎస్‌.ఆర్‌. స్కూల్‌లో ఏర్పాటు చేసిన స‌క్సెస్ మీట్ కార్య‌క్ర‌మంలో ఉత్తీర్ణ‌త సాధించిన విద్యార్థుల‌ను ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల స‌మ‌క్షంలో అభినందించారు. ఈ సంద‌ర్భంగా ఎం.ఎస్.ఆర్‌. స్కూల్ క‌ర‌స్పాండెంట్ కొల్లి నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ ఎస్‌కెపీవీవీ హిందూ హైస్కూల్స్ క‌మిటీ అనుబంద సంస్థ అయిన ఎం.ఎస్.ఆర్‌.స్కూల్ విద్యార్థులు సామాజిక బాధ్య‌తగా సేవా కార్య‌క్ర‌మాల‌తో పాటు చ‌దువులోనూ స‌త్తా చాటుతున్నార‌ని పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో ప‌దొవ త‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాల్లో త‌మ విద్యార్థులు 60 మంది విద్యార్థులు ప‌రీక్ష‌లు రాయ‌గా 59 మంది ఉత్తీర్ణ‌త శాతం సాదించార‌ని వారిలో 10/10 సాధించిన విద్యార్థులు ఏడుగురు ఉన్నార‌ని తెలిపారు. అలాగే స‌బ్జెక్టుల వారీగా కూడా విద్యార్థులు 9 పాయింట్ల‌కు పైగా ఉత్తీర్ణ‌త సాధించి ఇత‌ర విద్యార్థుల‌కు ఆద‌ర్శంగా నిలిచార‌ని చెప్పారు. తమ అధ్యాప‌క బృందం కృషితో పాటు త‌ల్లిదండ్రుల ప్రోత్సాహం, క‌మిటీ స‌హ‌కారం కార‌ణంగా విద్యార్థులు ప‌దొవ త‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాల్లో విజ‌య‌కేతనం ఎగుర‌వేశార‌ని తెలిపారు. అడ్మిష‌న్లు ప్రారంభ‌మ‌య్యాయ‌ని న‌గ‌రం న‌లుమూల‌ల నుండి విద్యార్థులు త‌మ పాఠ‌శాల‌లో చేరేందుకు ఆసక్తి క‌న‌బ‌రుస్తున్నార‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా కేకును క‌త్తిరించి విద్యార్థుల‌కు తినిపించారు. కార్య‌క్ర‌మంలో ఎస్‌కెపీవీవీ హిందూ హైస్కూల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రి అండ్ క‌ర‌స్పాండెంట్ గోపిశెట్టి మ‌ల్ల‌య్య‌, కేబీఎన్ క‌ళాశాల కార్య‌ద‌ర్శి తూనుగుంట్ల శ్రీనివాస‌రావు, ఎం.ఎస్‌.ఆర్‌. పాఠ‌శాల కోశాధికారి అమ‌ర్ సుధీర్‌, ప్ర‌ధానొపాధ్యాయురాలు పి.శ్యామ‌ల, ఇత‌ర క‌మిటీ స‌భ్యులు పాల్గొన్నారు.

Just In...