Published On: Tue, May 21st, 2019

ఓట్ల లెక్కింపు సమయంలో పారదర్శకత పాటించేలా చర్యలు తీసుకోవాలి

* సీఈసీకి తెదేపా ఎంపీ కనకమేడల లేఖ

సెల్ఐటి న్యూస్, దిల్లీ: ఓట్ల లెక్కింపు సమయంలో పారదర్శకత పాటించేలా చర్యలు తీసుకోవాలని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు సీఈసీ సునీల్‌ అరోడాకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పోలింగ్‌ ఏజెంట్లు ఎలాంటి పత్రాలు తేవొద్దని ఆర్వోలు చెప్పడం సరికాదన్నారు. పోలింగ్‌ నాటి వివరాలతో సరిపోల్చుకునే అవకాశం ఏజెంట్లకు ఇవ్వాలని కోరారు. వీవీప్యాట్ల లెక్కింపు ఉన్నందున ప్రక్రియ ఆలస్యమైనప్పటికీ ఏజెంట్లను మధ్యలో బయటకు పంపించొద్దని, అక్కడే భోజన సదుపాయాలు కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద వైకాపా కార్యకర్తలు అల్లర్లు సృష్టించే అవకాశముందనీ, అందువల్ల భద్రతను పెంచాలని ఈసీని కోరారు. లెక్కింపు రోజున సీలింగ్‌తో ఉన్న ఈవీఎంలను మాత్రమే లెక్కించాలని కనకమేడల విజ్ఞప్తి చేశరు.

Just In...