Published On: Wed, May 22nd, 2019

27 అర్ధరాత్రి వరకూ ఎన్నికల కోడ్‌

* కౌంటింగ్‌ పూర్తయ్యాకా రీపోలింగ్‌కు అవకాశం 

* అది కూడా తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే

* ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల ప్రధాన అధికారి గోపాల‌కృష్ణ ద్వివేది

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: తప్పనిసరి పరిస్థితుల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యాక కూడా రీపోలింగ్‌ నిర్వహించే అవకాశం ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఏదైనా పోలింగ్‌ బూత్‌లో ఈవీఎం డీకోడ్‌ కానప్పుడు, వీవీప్యాట్‌ స్లిప్పుల్లో తేడా రావడం, ఈవీఎంలు మొరాయించడం, పార్టీలకు వచ్చిన ఓట్ల మధ్య వ్యత్యాసం తక్కువగా ఉండడం, ఇతరత్రా ఏవైనా సమస్యలు వచ్చిన సందర్భాల్లోనే రీపోలింగ్‌ నిర్వహించే అవకాశం ఉందని ఆయన వివరించారు. ఎన్నికల కోడ్‌ ఈ నెల 27వ తేదీ అర్ధరాత్రి వరకూ అమల్లో ఉంటుందని చెప్పారు.

Just In...