Published On: Mon, Jun 10th, 2019

ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్

* 20 వాహనాలు స్వాధీనం

సెల్ఐటి న్యూస్‌, గంగవరం: కొన్ని నెలలుగా జిల్లాలో ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తూ పోలీసుల కళ్లు కప్పి తిరుగుతున్న దొంగను మండలంలోని పత్తికొండ  అటవీప్రాంతంలో శుక్రవారం చాకచక్యంగా పోలీసులు వలపన్ని అదుపులోకి తీసుకొన్నారు. ఈ మేరకు శనివారం ద్విచక్ర వాహన దొంగను అరెస్టు చూపుతూ, గంగవరం సర్కిల్ ఇన్స్‌పెక్ట‌ర్ శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. జీడీ నెల్లూరుకు  చెందిన లేట్ త్యాగరాజు కుమారుడు శ్రీధర్ (24) జులాయిగా తిరుగుతూ దూరలవాట్లకు బానిసై, విలాసవంతమైన జీవితం గడపాలని జిల్లాలోని అనేక చోట్లతో బాటు, నియోజకవర్గ పరిధిలోని పలుచోట్ల ఇరవై ద్విచక్ర వాహనాలను చోరీ చేశాడని ఆయన తెలిపారు. వీటి విలువ సుమారు రూ.15లక్షల దాకా ఉంటుందన్నారు. నిందితుడిని ఆధారాలతో సహా కోర్టుకు హాజరుపరుస్తామని, ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన పోలీసు సిబ్బందికి ఆయన రివార్డులు అందించారు.

Just In...