Published On: Mon, Jun 10th, 2019

దేవినేని ఉమాకు కొడాలి నాని కృతజ్ఞుడిగా ఉండాలి

* ఫేస్‌బుక్‌లో కేశినేని నాని పోస్టు

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: తెలుగుదేశం పార్టీలో విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును లక్ష్యంగా చేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం మరో రాజకీయ దుమారానికి తెరలేపింది. దేవినేని ఉమాకు కొడాలి నాని జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలంటూ తాజాగా కేశినేని నాని పోస్ట్ చేశారు. దేవినేని వల్లే కృష్ణా జిల్లా నుంచి కొడాలి నానికి మంత్రి అయ్యే అవకాశం దక్కిందని పేర్కొంటూ తాజాగా సోమ‌వారం ఫేస్‌బుక్‌లో వ్యంగ్యాస్త్రం సంధించారు. ఇటీవలే అధినేత చంద్రబాబుతో సమావేశమై తాను గత ఐదేళ్లలో పార్టీలో ఏ విధంగా ఇబ్బందులు పడిందీ వివరించారు. ఇప్పుడు మరో పోస్టు పెట్టడంతో నాని ఆంతర్యం ఏమిటన్నది తెలుగుదేశంలో ప్రశ్నార్థకంగా మారింది.

Just In...