Published On: Mon, Jun 10th, 2019

మార్కెట్లోకి టయోటా గ్లాన్జా

* రాధా గ్రూప్ ట‌యోటా షోరూమ్‌ల ద్వారా లాంఛ‌నంగా ఆవిష్క‌ర‌ణ‌

* గ్లాన్జా ఆవిష్కరణ వేడుకలలో అందాల తారలు ఇషాచావ్లా, లహరిల సందడి

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: అగ్రశ్రేణి వాహన ఉత్పత్తి సంస్థ టయోట కిర్లోస్కర్ మోటార్ నుండి గ్లాన్జా పేరుతో నూతనశ్రేణి కార్లు మార్కెట్లోకి విడుదలయ్యాయి. రాధ్రా గ్రూప్‌న‌కు చెందిన ఎనికేపాడు షోరూమ్‌లో గ్లాన్జా ఆవిష్కరణ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ సినీ తార‌లు ఇషాచావ్లా, లహరి పాల్గొని సందడి చేశారు. రాధా గ్రూప్ టయోట మేనేజింగ్ డైరెక్టర్ మాగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్లాన్జా సీరీస్ వాహనాలతో టయోట సంస్థ ప్రీమియమ్ బి. హై హ్యచ్ బ్యాక్ సీరీస్‌లోకి ప్రవేశించినట్లయిందని అన్నారు. కస్టమర్ ఫస్ట్ అనే టయోటా ఫిలాసఫీతో రాధా గ్రూప్ ముందుకు వెళుతుందని ఆకర్షణీయమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్లతో రూపొందించిన టయోటా గ్లాన్జా సీరీస్ కార్లు ప్రత్యేకంగా యువతను ఉద్దేశించి రూపొందించారని, తప్పకుండా వినియోగదారులని అమితంగా ఆకట్టుకుంటాయని అన్నారు. రాధాగ్రూప్ సీఈవో రంగస్వామి మాట్లాడుతూ ట‌యోటా గ్లాన్జా భారత్ స్టేజ్-6 కాలుష్య జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఉంటుందన్నారు. అద్భుతమైన ఇంటీరియల్‌తో పాటు ఆకట్టుకొనే ఎక్స్టీరియర్ గ్లాన్జా సొంతమన్నారు. సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ అనిల్‌కుమార్ జక్కన్న మాట్లాడుతూ సరికొత్త టయోటా గ్లాన్జా వాహనం రూ.7.28 లక్షల నుండి రూ.8.99 లక్షల ఎక్స్ షోరూమ్ ధరకు లభిస్తుందని తెలిపారు. మాన్యువల్ మరియు ఆటోమెటిక్ విభాగాల్లో మొత్తం 2 వెరియంట్లా లభ్యమయ్యే ఈ నూతన కార్లు యువతను ఇట్టే ఆకట్టుకుంటాయని అన్నారు. రాధాగ్రూప్ మార్కెటింగ్ విభాగం హెడ్ జయేంద్ర మాట్లాడుతూ మూడేళ్లు 1 లక్ష కిలోమీటర్ల కంపెనీ వారంటీతో పాటు, ఐదేళ్లు 2.20 లక్షల కిలో మీటర్ల ఎక్స్‌టెండ‌బుల్ వారంటీతో గ్లాన్జా అందుబాటులో ఉందని తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల పార్లమెంటు సభ్యులు నందిగం సురేష్ పాల్గొని తన అభినందనలు తెలిపారు. నగరంలో పలువురు ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాతగా మేఘన అందరిని అలరించారు. మోడల్స్ తమ అందచందాలతో హోయలు ఒలికిస్తూ ర్యాంప్ వాక్‌తో కనువిందు చేశారు.

Just In...