Published On: Tue, Jun 11th, 2019

‘పెద్దల సభలో తెలుగు పెద్ద’ పుస్తకావిష్కరణ

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘పెద్దల సభలో తెలుగు పెద్ద’ పుస్తకాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహ‌న్‌రెడ్డి మంగ‌ళ‌వారం ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా జాతీయ జ్యుడీషియల్‌ అకాడమీ డైరెక్టర్‌ జస్టిస్‌ రఘురాం, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, రైతు నేస్తం ఫౌండేషన్‌ ఛైర్మన్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్‌లో సి.నారాయణరెడ్డి ప్రసంగాలతో కూడిన ఈ పుస్తకాన్ని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ అనువదించి, సంకలనం చేశారు.

Just In...