Published On: Thu, Jun 13th, 2019

ఏపీఐఐసీ ఛైర్మ‌న్‌గా ఎమ్మెల్యే ఆర్‌.కె.రోజా

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు కీలక పదవి వరించింది. ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఐఐసీ) ఛైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం ఆమెను నియమించింది. ఈ మేర‌కు బుధ‌వారం ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. తనపై నమ్మకం ఉంచి ఏపీఐఐసీ ఛైర్మన్‌గా నియమించిన సీఎం జగన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాలో కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యే రోజా పోస్ట్‌ పెట్టారు. మంత్రిపదవి దక్కలేదని అందుకే మంత్రుల ప్రమాణస్వీకారానికి కూడా ఆమె హాజరు కాలేదని ఈ మధ్య ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మంగళవారం ముఖ్యమంత్రి జగన్‌ను రోజా కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వైకాపాలో అలకలు, బుజ్జగింపులు అంటూ ఏమీ ఉండవని..మంత్రి పదవి రాలేదని అసంతృప్తితో ఉన్నానన్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు.

Just In...