Published On: Fri, Jul 12th, 2019

బ‌డ్జెట్ అంచ‌నా… రూ.2,27,974.99 కోట్లు..

* ఏపీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన రాజేంద్ర‌నాథ్ రెడ్డి

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఏపీ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శుక్ర‌వారం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘ నేను సత్యానికి తప్ప దేనికీ లొంగి ఉండను. సత్యం కాక నేను సేవించవలసిన ఏ దేవుడూ లేడు’’ అంటూ గాంధీజీ చెప్పిన మాటలను ఉటంకించారు. రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యమన్నారు. ‘‘ప్రజలు కోరిన పాలన కోసం సీఎం కృషి చేస్తున్నారు. నమ్మకం, విశ్వసనీయతే ప్రాతిపదికగా ప్రజలు తీర్పు ఇచ్చారు. విలువలతో కూడిన రాజకీయాలను పునరుద్ధరించేందుకు సీఎం కృషి చేస్తున్నారు. పార్టీ మేనిఫెస్టో తమకు పవిత్ర గ్రంథమని సీఎం జగన్‌ చెప్పారు. మా ప్రభుత్వానికి మేనిఫెస్టోనే ప్రధాన నియమావళిగా ఉంటుంది’’ అని బుగ్గన చెప్పారు.

బడ్జెట్‌ అంచనా ఎంతంటే…
బడ్జెట్‌ అంచనా రూ.2,27,974.99 కోట్లు కాగా.. రెవెన్యూ వ్యయం రూ.1,80,475 కోట్లు అని మంత్రి బుగ్గన వెల్లడించారు. మూలధన వ్యయం రూ.32,293.39 కోట్లు కాగా.. వడ్డీ చెల్లింపుల కోసం రూ.8,994 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 2018-19 బడ్జెట్‌తో పోలిస్తే తాజా బడ్జెట్‌లో 19.32 శాతం పెరుగుదల ఉందని చెప్పారు. రెవెన్యూ లోటు రూ.1778.52, ద్రవ్యలోటు సుమారు రూ.35,260 కోట్లు, జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు సుమారు 3.3 శాతం ఉన్నట్లు తెలిపారు.  గత ప్రభుత్వం ఇచ్చిన రెండంకెల వృద్ధిరేటుపై సమీక్షిస్తున్నామని బుగ్గన తెలిపారు. రెండంకెల వృద్ధి ఉంటే ప్రజలు ఇంకా పేదరికంలో ఎందుకున్నారో పరిశీలిస్తున్నామన్నారు.

Just In...