Published On: Mon, Jul 15th, 2019

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర‌ప‌తి కోవింద్‌

సెల్ఐటి న్యూస్‌, తిరుమల: శ్రీ వేంకటేశ్వర స్వామివారిని భార‌త రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా శనివారం రాత్రే తిరుమలకు చేరుకున్న రాష్ట్రపతి.. ఆదివారం ఉద‌యం ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆనంద నిలయంలో శ్రీవారి మూల విరాట్‌ను దర్శించుకున్నారు. సబేరాలో అర్చకులు, అధికారులు రాష్ట్రపతిని స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. రంగనాయకుల మండపంలో రాష్ట్రపతి దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేశారు. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ వారికి స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాష్ట్రపతి పర్యటనలో గవర్నర్ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌, ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, దిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి విజయసాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Just In...