Published On: Sat, Aug 10th, 2019

పీబీ సిద్ధార్థకు నాక్ ఏ ప్లస్ గుర్తింపు రావడం ఆనందంగా వుంది

*  కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్
సెల్ఐటి న్యూస్, ఎడ్యుకేషన్: పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు నాక్ ఏ ప్లస్ గుర్తింపు లభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్ తెలియజేశారు. శనివారం ఉదయం కళాశాలలో ఏర్పాటుచేసిన  విలేకరుల సమావేశంలో  ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్ మాట్లాడుతూ దేశంలోని ఉన్నత విద్యా సంస్థలకు మౌలిక సదుపాయాలు పనితీరు ఆధారంగా గ్రేడింగ్ కేటాయించే ప్రాధికార సంస్థ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ ఏడు అంశాల ప్రాతిపదికన 3.32 సగటు మార్కులతో ఏ ప్లస్ గ్రేడ్ అందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 5, 6 తేదీలలో కళాశాలను సందర్శించిన నాక్ బృందం అన్ని సదుపాయాలను, విద్యా ప్రమాణాలను, పరీక్షా ఫలితాలను, బోధనేతర అంశాలలో విద్యార్థుల ప్రతిభ పాటవాలను, విద్యార్థులు సాధించిన ఉపాధి అవకాశాలను తదితర అంశాలను మదింపు చేసి నాక్ కేంద్ర కార్యాలయానికి తమ నివేదికను సమర్పించినట్లు తెలిపారు. 2004, 2012  సంవత్సరాలలో రెండు పర్యాయాలుగా నాక్ బృందం సందర్శించి ఏ గ్రేడ్ కేటాయించినట్లు ఇటీవల జరిగిన నాక్ సమీక్షలో గతంలో సాధించిన గ్రేడ్ ను మరింత మెరుగు పరుచుకుని ఏ ప్లస్ గ్రేడ్ సాధించటం కళాశాల యాజమాన్యానికి, అధ్యాపకులకు, సిబ్బందికి, విద్యార్థినీ విద్యార్థులకు ఎంతో గర్వకారణమని డైరెక్టర్ వేమూరి బాబురావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆగస్టు 10వ తేదీ కళాశాల సెమినార్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కళాశాల నాక్ కమిటీ సమన్వయకర్త డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్, డీన్ రాజేష్ జంపాల, ప్లేస్మెంట్ ఆఫీసర్ శ్రీధర్ కావూరి పాల్గొని వివరాలు వెల్లడించారు. సిద్ధార్థ అకాడమీ తరఫున అధ్యక్ష కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వర్లు, పాలడుగు లక్ష్మణరావు, కళాశాల కన్వీనర్ సూరెడ్డి వెంకటేశ్వరరావు, అకాడమీ సభ్యులు కళాశాల సిబ్బందిని అభినందించారు.
I’m protected online with Avast Free Antivirus. Get it here — it’s free forever.

Just In...