Published On: Sat, Aug 10th, 2019

ఆయుర్వేదంతోనే ఆరోగ్యం…

* శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

సెల్ఐటి న్యూస్, హైదరాబాద్: ఆయుర్వేదంతోనే ఆరోగ్యం సిద్ధిస్తుందని, ప్రస్తుతం ఆరోగ్యంలో ఆయుర్వేద వైద్యం ప్రధాన పాత్ర పోషిస్తోందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. ఆయుర్వేద వైద్యంలో పరిశోధనలు పెరగాల్సిన అవసరం ఉందని, అంతరించిపోతున్న సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఆయుర్వేద పంచకర్మ వైద్యంలో ఎంతో పేరుపొందిన ట్రావెన్కర్ ఆయుర్వేద శనివారం గచ్చిబౌలి ఇందిరానగర్లోని సైబర్ రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన అథెంటిక్ ఆయుర్వేద హాస్పిటల్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బావెన్ కోర్ ఆయుర్వేద ప్రాక్టీస్ అండ్ గవర్నెన్స్ హెడ్ డాక్టర్ స్మిత, మియాపూర్ ఏసీపీ రవికుమార్, డాక్టర్ బి.ఆర్.కె.ఆర్ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల హెడ్ ప్రొఫెసర్ ఆర్. వైద్యనాధ్, నల్లగండ్ల హుడా కాలనీ అధ్యక్షుడు మంత్రిప్రగడ సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల హైదరాబాద్ లోని మదీనాగూడ బ్రాంచీకు తొలిసారిగా తెలంగాణలో నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ (ఎన్ఏబీహెచ్) గుర్తింపు లభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పంచకర్మ క్లినిక్లను నిర్వహిస్తున్న ట్రావెన్ కోర్ పంచకర్మ క్లినిక్లలో నిర్వహిస్తున్న వైద్య చికిత్సలు, నాణ్యతా ప్రమాణాలు, రక్షణ పరంగా తీసుకుంటున్న చర్యలను పరిశీలించి ఈ గుర్తింపు అందించారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎన్ఏబీహెచ్ అందించిన ఈ సర్టిఫికెట్లు ఇటీవల అందుకున్నారు. ఈ సందర్భంగా అలాగే ట్రావెన్ కోర్ ఆయుర్వేద ప్రాక్టీస్ అండ్ గవర్నెన్స్ హెడ్ డాక్టర్ స్మిత మాట్లాడుతూ 2014 సంవత్సరం నుంచి ప్రజలకు తాము అందిస్తున్న నాణ్యమైన వైద్యానికి ఈ గుర్తింపు లభించడం తమ బాధ్యతలను మరింత పెంచిందన్నారు. ప్రస్తుతం తమ సంస్థ కేరళలోని అలెప్పీ, బెంగుళూరులోని జయనగర్, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నంతోపాటు తెలంగాణలోని మదీనాగూడ, గచ్చిబౌలి, సైనికపురిలో కేంద్రాలను నిర్వహిస్తోందని వెల్లడించారు. పని ఒత్తిడి, పెయిన్ మేనేజ్మెంట్, అధిక బరువు నియంత్రణ, గైనకాలజీ సమస్యలతో పాటు మాతృరక్ష, వామనం, విరేచనం, వాస్తి, నస్యం, రక్తమోక్షనం, ఆర్టిరైటిస్, స్పాండిలైటిస్, వెలనెస్ ప్రోగ్రామ్స్ తదితర సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు ఎలాంటి వైద్యం అవసరమో తెలుసుకుని నిబంధనలకు అనుగుణంగా తమ క్లినిక్లలో వైద్యసేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఇటీవల ఉత్తమ పంచకర్మ క్లినిక్, వెలనెస్ చైన్ ఇన్ ఇండియా అవార్డును 2017 హెల్త్ కేర్ అవార్డును కూడా అందుకున్నట్లు వివరించారు. 2018లో సౌత్ ఇండియాలోనే ఉత్తమ ఆయుర్వేద కేంద్రంగా టైమ్స్ సైబర్ మీడియా ఇంటర్నేషనల్ హెల్త్ కేర్ అవార్డును పొందినట్లు డాక్టర్ స్మిత వెల్లడించారు.

 

Just In...